Cyberabad Traffic Police: నాణ్యతతో కూడిన హెల్మెట్ వాడండి.. వాహనదారులకు సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక
Cyberabad Traffic Police: తెలంగాణ ట్రాఫిక్ పోలీసు శాఖ వాహనదారుల విషయంలో నిబంధనలు మరింత కఠితరం చేస్తోంది. వాహనదారులకు డ్రైవింగ్ సమయంలో..
Cyberabad Traffic Police: తెలంగాణ ట్రాఫిక్ పోలీసు శాఖ వాహనదారుల విషయంలో నిబంధనలు మరింత కఠితరం చేస్తోంది. వాహనదారులకు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ గానీ, వాహనానికి సంబంధించిన పత్రాలు లేని సమయంలో కఠిన చర్యలు చేపడతామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు హెచ్చరిస్తోంది. అయితే గతంలో కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ జారీ చేసిన జీవోను ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని, ఆ హెల్మెట్ కూడా నాణ్యతతో కూడుకున్నది ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా నాణ్యతతో లేని హెల్మెట్లను విక్రయించినట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS)కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కాగా, ప్రస్తుతం రోజురోజుకు రోడ్డు ప్రమాదంలో ఎక్కువైపోతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. ద్విచక్ర వాహనాలు అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, ఓవర్‌టెక్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇలా రకరకాల కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలో చోటు చేసుకుని ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇది వరకు వాహనం నడిపే వారికి మాత్రమే హెల్మెట్ ఉండాలని నిబంధనలు ఉండగా, తాజాగా వాహనం వెనుకాల కూర్చుండే వ్యక్తికి కూడా హెల్మెట్ ఉండాలనే నిబంధన విధించారు. దీంతో డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు వెనుకాల కూర్చున్న మరో వ్యక్తికి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ఉండాల్సిందే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేయనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇలా ఇద్దరికి కూడా హెల్మెట్ ఉండాలని నిబంధన విధిస్తోంది ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్లు కూడా నాణ్యతతో ఉన్నాయా..?లేదా అనేది చూస్తున్నారు పోలీసులు.
Dear citizens,
The Ministry of Road Transport and Highways, Govt Of India has brought helmet under the mandatory BIS quality control regime from 01.06.2021 vide the notification dated 26.11.2020. (1/2) pic.twitter.com/LVh8NEEc10
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 3, 2021