HCU భూ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే?
Kancha Gachibowli Land Issue: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ప్రభుత్వం వేలానికి వేయాలనుకున్న 400 ఎకరాల భూమిలో వందలాది ఔషద మొక్కలు, జీవరాశులు, ఉన్నాయని..పర్యావరణానికి విఘాతం కలింగించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలిలోని భూముల వ్వవహారంపై లేఖ రాసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలానికి పెట్టిందని..ఈ మేరకు ఆ ప్రాంతంలోని చెట్లను తొలగిస్తున్నట్టు తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహరారంలో కేంద్రం జోక్యం చేసుకొని అటవీ ప్రాంతమైన 400 ఎకరాల భూమిని రక్షించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆద్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిలో వందలాది రకాలు ఔషద మొక్కలు, 200లకుపైగా పక్షులు, చెరువులు ఉన్నట్టు పేర్కొన్నారు. 400 ఎకరాల భూమిలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి సర్వే నిర్వహించలేదని.. ఆలాంటప్పుడు సరిహద్దులు ఎలా గుర్తిస్తారని ఆయన ప్రశ్నించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించవద్దని కేంద్రమంత్రి లేఖలో ప్రస్తావించారు.
ఐటీ పార్క్ డెవలప్మెంట్ కోసం HCUలోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమైంది. ఆ ప్రాంతంలోని చెట్లను తొలగించేందుకు జేసీబీలను తీసుకొచ్చింది. ఈ వ్యవహారం HCU విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆవరణలోని చెట్లను తొలగించడంతో అటవీలోని జంతువులు, పక్షులకు నివాసం లేకుండా పోతుందని..HCU విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లను తోలగించడం వల్ల హైదరాబాద్ లో 1 నుంచి 4 శాతం డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెట్ల తొలగింపు ప్రక్రియతో పాటు.. వేలాన్ని నిలిపి వేయాలని ధర్నాకు దిగారు. జేసీబీలను అడ్డుకోవడానికి వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్టులు చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. మరో వైపు విద్యార్థుల అరెస్టులను అటు ప్రతిపక్షాలు సైతం ఖండిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రభుత్వం మాత్రం తాము వేలానికి వేసింది ప్రభుత్వానికి చెందిన భూమేనని చెబుతోంది. గత కొన్నేళ్లుగా పడావు పడిన భూమిలో చెట్లు మొలుస్తే అది అడవి అవుతుందా అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..