Vande Bharat Sleeper: తెలుగురాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్స్- ఏ రూట్లలో నడవనున్నాయో తెలుసా!
అధునాతన టెక్నాలజీతో భారత రైల్వేశాఖ రూపురేఖలనే మార్చింది వందేభారత్ రైలు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఈ రైలు భారత రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయనాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే పగటి వేళల్లో తెలుగురాష్ట్రాల్లో పరుగులు పెడుతున్న ఈ వందేభారత్ రైలు..ఇక రాత్రివేలళ్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

అధునాతన టెక్నాలజీతో భారత రైల్వేశాఖ రూపురేఖలనే మార్చింది వందేభారత్ రైలు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఈ రైలు భారత రైల్వే వ్యవస్థలో కొత్త అధ్యాయనాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే పగటి వేళల్లో తెలుగురాష్ట్రాల్లో పరుగులు పెడుతున్న ఈ వందేభారత్ రైలు..ఇక రాత్రివేలళ్లో కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది. సరి కొత్త స్వదేశీ టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. అయితే తొలి విడతలోనే వీటిని తెలుగు రాష్ట్రాలకు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. తాజాగా రైలు కోటా డివిజన్‌లో సక్సెస్ ఫుల్‌గా ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 మార్గాల్లో ఈ వందేభారత్ రైళ్ల అందుబాటులో ఉన్నాయి. కాగా తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లకు డిమాండ్ పెరగడంతో.. వందేభారత్ స్లీపర్లను కూడా తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి విడతగా 9 వందేభారత్ స్లీపర్ ట్రైన్ సర్వీసులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధంచేసుకోంది. ఈ రైళ్లు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారవుతున్నట్టు తెలుస్తోంది. ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభవాన్ని ఇచ్చే రీతిలో రైల్వేశాఖ వీటిని తయారు చేసింది. ప్రయాణికుల రాత్రి ప్రయాణాలకు వీలుగా ఉండేలా రైల్వే శాఖ ఈ రైళ్లను రూపొందించింది. ఈ రైళ్లు 16 కోచ్ లతో మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లలో ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ అందుబాటులో ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 24 వందేభారత్ స్లీపర్ ట్రైన్స్‌ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు రెండు కేటాయించేలా నిర్ణయించినట్లు సమాచారం.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న వందేభారత్ రైళ్లకు భారీగా ఆదరణ పెరుగుతోంది. దీంతో, దూర ప్రయాణాలు సాగించే ప్రయాణికుల కోసం వందేభారత్ స్లీపర్ ట్రైన్స్‌ను కేటాయించాలని తెలుగురాష్ట్రాల ఎంపీలు కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగురాష్ట్రాలకు కేంద్రం తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ ట్రైన్లను కేటాయించినట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు కేటాయించబోయే ఈ రెండు వందేభారత్ స్లీపర్లు ఏ రూట్లలో నడిపించాలనే దానిపై రైల్వేశాఖ ఇటీవలే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్‌ను విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రైలు విజయవాడ నుండి వరంగల్ మీదుగా ప్రయాణించి అయోధ్య, వారణాసి వరకు వెళ్లనుంది. ఇక మరో రైలు సికింద్రాబాద్ నుండి తిరుపతికి నడిచేలా ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటి ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, ధార్మిక కేంద్రాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుంది. తెలుగురాష్ట్రాల్లో వీటికి డిమాండ్ బాగా పెరగడంతో వీటిని మొదటి విడతలోనే అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
