Dakshin health summit: హైదరాబాద్‌లో నేడు దక్షిణ్ హెల్త్ సమ్మిట్.. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో..
భారతదేశంలో ఆరోగ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా వైద్య రంగంలో అధునాతన ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం సైతం పెరిగింది. దీంతో కొత్త ఆవిష్కరణలకు వైద్య రంగ గతిని తిప్పుతున్నాయి, సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే...
భారతదేశంలో ఆరోగ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా వైద్య రంగంలో అధునాతన ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం సైతం పెరిగింది. దీంతో కొత్త ఆవిష్కరణలకు వైద్య రంగ గతిని తిప్పుతున్నాయి, సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో వస్తున్న మార్పులపై, ఎదురవుతోన్న సమస్యలపై చర్చించడానికి టీవీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో దక్షిణ్ హెల్త్ సమ్మిట్ నిర్వహిస్తోంది.
ఆగస్టు 3వ తేదీ (శనివారం) హైదరాబాద్‌లో ఈ సమ్మిట్ జరగనుంది. ఇంతకీ ఈ కార్యక్రమంలో ఎవరెవరు హాజరుకానున్నారు.? ఎలాంటి అంశాలపై చర్చించనున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. సదరన్ హెల్త్ కేర్ సమ్మిట్ 2024 పేరుతో నిర్వహించినున్న ఈ కార్యక్రమానికి అత్యున్నత స్థాయి వైద్య నిపుణులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొంటారు.
ఈ సమావేశంలో ఆరోగ్య సాంకేతికతలో పురోగతి, వేగంగా మారుతున్న వైద్య విధానాన్ని ప్రదర్శించనున్నారు. ఏఐ విజనరీ కేర్, రోబోటిక్స్‌తో సహా వైద్య సాంకేతికతలో కొత్త ఆవిష్కరణల గురించి చర్చించనున్నారు. డిజిటల్ హెల్త్ అండ్ డేటా అనలిటిక్స్, మెటబాలిక్ హెల్త్, డయాబెటిస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్లపై చర్చించనున్నారు. సదరన్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024ను అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి బాధ్యతలు చూస్తున్నారు. భారతదేశంలోని హెల్త్‌కేర్ సెక్టార్‌లో అతిపెద్ద వాటాదారులలో ఒకరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమ్మిట్‌లో భారత దేశానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు.. డా. అరవిందర్ సింగ్ సోనిన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్, ప్రశాంత్ ప్రకాష్, మేనేజింగ్ పార్టనర్ అండ్ ఎక్సెల్ ఇండియా వ్యవస్థాపకుడు, డా. భృతి లుంబా, ఫోర్టిస్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ హెడ్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రోగ్రామ్, డైరెక్టర్ & ఫౌండర్, న్యూరాలజీ & స్లీప్ సెంటర్ (న్యూ ఢిల్లీ), డా. మన్వీర్ భాటియా, క్లినికల్ ప్రాసెస్ లీడ్ ఫిజీషియన్ (లండన్) డా. ఉమర్ ఖాదిర్, ప్రొ. IISc డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెవలప్‌మెంటల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ డా. డాక్టర్ దీపక్ సైనీ, SOHFIT వ్యవస్థాపకుడుతో మరెంతో మంది ప్రముఖ నిపుణులు పాల్గొంటున్నారు.
భారతదేశ ఆరోగ్య పరిశ్రమ వృద్ధిని ప్రేరేపించేందుకు ఈ హెల్త్‌కేర్ సమ్మిట్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంపై ప్రభావం చూపే ట్రెండ్‌లను సమ్మిట్ అన్వేషిస్తుంది. ఈ కార్యక్రమాన్ని టీవీ9 నెటవర్క్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష కార్యక్రమం టీవీ9 నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..