AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: కేవలం రూ.300కే గ్యాస్ సిలిండర్.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. అందరూ పొందే అవకాశం

ప్రముఖ ఆయిల్ కంపెనీ బీపీసీఎల్ కొత్త తరహా గ్యాస్ సిలిండర్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ప్లాస్టిక్‌ సిలిండర్ల బరువు చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం గోవాలో వీటిని లాంచ్ చేయగా.. త్వరలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది.

Gas Cylinder: కేవలం రూ.300కే గ్యాస్ సిలిండర్.. ఈ ఒక్క పని చేస్తే చాలు.. అందరూ పొందే అవకాశం
సిలిండర్ ఖాళీ భాగంలో నీళ్లు త్వరగా ఎండిపోతుంది. అయితే గ్యాస్ నిండిన భాగం చల్లగా ఉండటం వలన అక్కడ తేమ ఎండిపోవడానికి సమయం పడుతుంది. ఆ భాగంలో తేమ మొత్తం మిగిలిన గ్యాస్ మొత్తానికి సమానం అని భావించాలి.
Venkatrao Lella
|

Updated on: Feb 02, 2026 | 10:59 AM

Share

గ్యాస్ సిలిండర్ల రూపం భవిష్యత్తులో పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు ఎల్పీజీ సిలిండర్లు అనగానే ఎరుపు రంగులో ఉండే ఇనుముతో తయారుచేసినవే మనకు గుర్తొచ్చాయి. పాతపడిపోయి, తప్పుబట్టి, మట్టి కొట్టుకుపోయి పోయి కనిపిస్తున్నాయి. ఇనుముతో తయారుచేసినవి కావడంతో ఈ గ్యాస్ సిలిండర్లు బాగా బరువుగా ఉంటాయి. వీటిని పక్కకి కదిలించాలన్నా లేదా పైకి ఎత్తి పట్టుకోవాలన్నా బరువుగా ఉండటం వల్ల కష్టమవుతుంది. కానీ గ్యాస్ సిలిండర్ల రూపంలో సరికొత్త విప్లవం త్వరలో రాబోతుంది. ఇక నుంచి అత్యంత తేలికగా ఉండే గ్యాస్ సిలిండర్లు రాబోతున్నాయి. అతి తక్కువ బరువు ఉండటంతో పాటు లుక్‌లో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని మోడ్రన్ గ్యాస్ సిలిండర్లుగా పిలుస్తున్నారు.

కంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్

మార్కెట్లోకి కొత్త సిలిండర్లు వచ్చేశాయి. హై డెన్సిటీ పాలిథిలిన్ అేనే మోడ్రన్ మెటిరియల్‌తో తయారుచేసిన కొత్త రకం సిలిండర్లను ప్రముఖ గ్యాస్ సరఫరా సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. భారత్ గ్యాస్ లైట్ పేరుతో వీటిని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇవి గ్యాస్ ఫుల్‌గా నింపినా చాలా తక్కువ బరువుతో ఉంటాయి. గ్యాస్ నిండుగా నింపినా సరే ఈ సిలిండర్ బరువు కేవలం 15.9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇనుప సిలిండర్లతో పోలిస్తే వీటి బరువు సగానికి సగం తగ్గిపోతుంది. అలాగే గ్యాస్ సేఫ్టీ పరంగా ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. గ్యాస్ లీకైనా వెంటనే పేలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ గ్యాస్ సిలిండర్ నెమ్మదిగా లీక్ అవ్వడం వల్ల ప్రెజర్ ఎక్కువగా ఉండదు.

కేవలం రూ.300కే కొత్త సిలిండర్

పాత ఇనుప గ్యాస్ సిలిండర్లు 80 కిలోల ప్రెజర్ తట్టుకుంటాయి. కానీ ఈ కొత్త సిలిండర్లు 120 కిలోల ప్రెజర్ వరకు తట్టుకుంటాయి. ఇక సిలిండర్లు బ్లూ, ఎల్లో కలర్ రంగుల్లో ఉంటాయి. ఇక ఇందులో మరో మరోక ప్రత్యేకత ఏంటి అంటే.. గ్యాస్ లెవల్ ఎంత ఉందో సులువుగా చూసుకోవచ్చు. ఈ సిలిండర్‌కు ఒక కిటికీ లాంటిది ఉంటుంది. దాని నుంచి గ్యాస్ లెవల్ చెక్ చేసుకోవచ్చు. ఇక ఇనుప సిలిండర్లు వెంటనే తప్పు పట్టి పోతాయి. కానీ ఇవి ప్లాస్టిక్‌తో తయారు చేసినవి కావడంతో మరకలు, తుప్పు వంటి సమస్య ఉండనే ఉండదు. ఈ కొత్త సిలిండర్ అసలు ధర రూ.3,350గా ఉంది. కానీ పాత ఇనుప సిలిండర్ రిటర్న్ ఇచ్చేసి ఈ కొత్తది తీసుకోవాలంటే కేవలం రూ.300 మాత్రమే బీపీసీఎల్ వసూలు చేస్తోంది. ఈ మేరకు కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది.

Follow Us