TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. న్యూఇయర్ వేళ తీపికబురు..

TSRTC: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు అందించారు...

TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. న్యూఇయర్ వేళ తీపికబురు..
Tsrtc
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 01, 2022 | 5:19 PM

కొత్త సంవత్సరం తొలి రోజున ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీపికబురు అందించారు. ఎంప్లాయిస్‌కు సంబంధించి ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను ఈ సంవత్సరంలో కచ్చితంగా సాల్వ్ చేస్తామని చెప్పారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని సజ్జనార్ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలి’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

.ఇదిలా ఉంటే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పన్నెండేళ్లలోపు చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. రానున్న రోజుల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు శాశ్వతంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని.. దీని వల్ల టీఎస్ఆర్టీసీ అక్యుపెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.