AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ బెటర్: కేటీఆర్

నడ్డా…ఇది తెలంగాణ బిడ్డల గడ్డ..అమాయకులెవరూ లేరిక్కడ. అందరం ఆరితేరినవారమే. మీ కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ చెల్లవు’. అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆయన జేపీ నడ్డా కాదు. అబద్దాల అడ్డా అని తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన కూకట్‌పల్లి నియోజకవర్గం బూత్‌స్థాయి, డివిజన్‌, అనుబంధ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు సభ్యత్వాన్ని పూర్తిచేసుకొని తెరాస తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆదివారం భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు […]

ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ బెటర్: కేటీఆర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 20, 2019 | 6:43 AM

Share

నడ్డా…ఇది తెలంగాణ బిడ్డల గడ్డ..అమాయకులెవరూ లేరిక్కడ. అందరం ఆరితేరినవారమే. మీ కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ చెల్లవు’. అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆయన జేపీ నడ్డా కాదు. అబద్దాల అడ్డా అని తీవ్రంగా విమర్శించారు. సోమవారం జరిగిన కూకట్‌పల్లి నియోజకవర్గం బూత్‌స్థాయి, డివిజన్‌, అనుబంధ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు సభ్యత్వాన్ని పూర్తిచేసుకొని తెరాస తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆదివారం భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెరాసపై, కేసీఆర్‌పై చేసిన ఆరోపణలపై కేటీఆర్‌ ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. ఆయుష్మాన్‌ భారత్‌కంటే ఆరోగ్యశ్రీ చాలా మెరుగైన పథకమని మా సీఎం కేంద్రం ముఖం మీదే చెప్పారు. ఇందులో చిన్నచిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటాం తప్ప మీ సహకారం, సాయం మాకు అవసరం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాది రెండు నాల్కల ధోరణి అని, గతంలో ఆరోగ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ఆయన ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, భాస్కర్‌రావు, గొంగిడి సునీత, భూపాల్‌రెడ్డిలు సోమవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ, నడ్డా కేంద్ర వైద్య శాఖ మంత్రిగా ఆరోగ్యశ్రీని మెచ్చుకున్నారని, ఆయనతోపాటు కేంద్ర మంత్రులు, అధికారులు తెరాస ప్రభుత్వాన్ని పొగిడారన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి అబద్దపు ఆరోపణలు చేశారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వాటిని ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ నేతలకు చేతనైతే తెలంగాణకు విభజన చట్టం హామీలు అమలు పరచాలని అన్నారు.

Follow Us
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది
వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది.. ఆకలితో ఉన్న సింహం ఎంత పని చేసింది