Traffic Diversion: ముస్లింలకు ఇవాళ తెలంగాణ సర్కార్ ఇఫ్తార్‌ విందు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad Traffic Diversion: తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియం మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాపెల్ రోడ్డు మీదుగా..

Traffic Diversion: ముస్లింలకు ఇవాళ తెలంగాణ సర్కార్ ఇఫ్తార్‌ విందు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Cm Kcr Dawat E Iftar
Follow us

|

Updated on: Apr 29, 2022 | 1:05 PM

Dawat-e-Iftar: తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో శుక్రవారం ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(CM KCR) హాజరు కానున్నారు. ఇఫ్తార్‌ విందుకు ప్రత్యేక పాసులున్న వారినే అనుమతి ఇవ్వనున్నారు. ఎల్‌.బీ. స్టేడియంలో ఇఫ్తార్‌ విందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ఇతర వాహనాలకు అనుమతి లేదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు.

ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఈరోజు హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో ఇచ్చే ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇస్తున్న ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం మత పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తొద్దనే ముందస్తు జాగ్రత్తతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

వాహనాల రాకపోకలపై ఆంక్షలు..

ఎల్బీ స్టేడియం మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. చాపెల్ రోడ్డు మీదుగా జగ్జీవన్ రామ్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను పోలీస్ కంట్రోల్ రూం మీదుగా దారి మళ్లించనున్నారు. గన్ ఫౌండ్రీలోని ఎస్బీఐ మీదుగా బషీర్​బాగ్ పైవంతెన వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రవీంద్ర భారతి నుంచి జగ్జీవన్​రామ్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను.. సుజాత ఉన్నత పాఠశాల, పతే మైదాన్ మీదుగా దారి మళ్లించనున్నారు. బషీర్​బాగ్ పైవంతెన మీది నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు.. చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. నారాయణగూడ నుంచి బషీర్​బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్​నగర్ కూడలి నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కింగ్ కోఠి నుంచి బొగ్గులకుంట మీదుగా బషీర్​బాగ్ వైపు వచ్చే వాహనాలను… ఈడెన్ గార్డెన్ వైపు నుంచి వెళ్లేలా దారి మళ్లించనున్నారు.

ఇక రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్‌ విదా) ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్‌, మక్కామసీదు వద్ద, సికింద్రాబాద్‌ జామా మసీద్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసులు వెల్లడించారు.

తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి: Health Tips: ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే..

Back Pain Remedies: వెన్నునొప్పికి దాల్చిన చెక్కతో ఉపశమనం.. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనం..

Tea and Diabetes: ఈ స్పెషల్ టీ డయాబెటిక్ పేషెంట్‌కి దివ్యౌషధం.. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇలా వాడండి..