AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ వినియోగదారుడికి ఎయిర్‌టెల్ షాక్.. బిల్లు చూసి దిమ్మతిరిగి ఏంచేశాడంటే..

Hyderabad: హైదరాబాద్ కు చెందిన ఒక కస్టమర్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ షాకిచ్చింది. అంతర్జాతీయ రోమింగ్ సేవల కోసం సంప్రదించగా పెద్ద పొరపాటు జరిగింది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..

Hyderabad: హైదరాబాద్ వినియోగదారుడికి ఎయిర్‌టెల్ షాక్.. బిల్లు చూసి దిమ్మతిరిగి ఏంచేశాడంటే..
Ayyappa Mamidi
|

Updated on: Apr 29, 2022 | 7:27 AM

Share

Hyderabad: హైదరాబాద్ కు చెందిన ఒక కస్టమర్‌కు టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ షాకిచ్చింది. అంతర్జాతీయ రోమింగ్(International Roaming) సేవల కోసం సంప్రదించగా.. తప్పుడు సమాచారం ఇవ్వడంతో అతనికి రూ.1,41,770 బిల్లు వచ్చింది. విదేశాలకు కుటుంబంతో కలిసి సరదాగా వెళ్లిన వ్యక్తికి చివరికి తీవ్ర మనోవేదన మాత్రమే మిగిలింది. ఈ విషయంలో ఎయిర్‌టెల్(Airtel) తీరును సదరు వ్యక్తి తప్పుపట్టాడు. దీంతో ఆయన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 రూ. 50వేల పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జల్‌వాయు టవర్స్‌లో ఉంటున్న విశ్రాంత వింగ్ కమాండర్ సమర్ చక్రవర్తి, భార్యతో కలిసి బహమాస్ తో పాటు అక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకున్నారు.

అంతర్జాతీయ రోమింగ్ కోసం ఎయిర్‌టెల్ సంస్థను ఆశ్రయించారు. 2014 నుంచి పోస్ట్ పెయిడ్ సర్వీస్ వినియోగిస్తున్నానని బేగంపేట్‌లోని ఎయిర్‌టెల్ సేవా కేంద్రం సిబ్బందికి తెలపగా అమెరికా ప్లాన్-బి వినియోగిస్తే బహమాస్‌లోనూ పనిచేస్తుందని వారు సూచించారు. ఫిర్యాదు దారు 2018 జూన్ 27న నూజెర్సీ చేరుకుని ఆమేరకు రూ. 3,999తో పాటు అదనంగా రూ. 149 రీఛార్జ్ చేయించారు. రీఛార్జ్ పూర్తికాగానే.. 500 అవుట్ గోయింగ్ కాల్స్, 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు, ఇన్‌కమింగ్ కాల్స్ ప్లాన్ ప్రకారం అందుబాటులో ఉంటాయని సందేశం వచ్చింది. కొత్త ప్లాన్‌ను యాక్టివేట్ చేసినప్పటినుంచి పలుమార్లు అంతర్జాతీయ రోమింగ్ సేవలు అందలేదని పదేపదే డిస్‌కనెక్ట్ అవుతోందని ఎయిర్ టెల్ సేవా కేంద్రానికి సమర్ ఫిర్యాదు చేశారు.

నాస్సౌ, బహమాస్ చేరుకోగానే బిల్లు రూ.1,41,770 అయ్యిందంటూ సదరు వినియోగదారుడికి ఎయిర్ టెల్ నుంచి ఒక సందేశం వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైన సమర్ చక్రవర్తి.. అప్రమత్తమై మరోమారు కస్టమర్ కేర్ ను సంప్రదించాడు. దీంతో అక్కడ ఆ ప్లాన్ పనిచేయదంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో దిగొచ్చిన ఎయిర్‌టెల్ సంస్థ ఆ బిల్లులో కొంత మొత్తాన్ని తగ్గిస్తామని చెప్పింది. ఈ విషయంలో ఎయిర్ టెల్ కంపెనీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని.. బిల్లును సరిదిద్దుకోవడంతో పాటు పరిహారాన్ని 45 రోజుల్లోపు చెల్లించాలని హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 తీర్పు వెలువరించింది. సకాలంలో చెల్లించకపోతే 12 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవీ చదవండి..

LIC IPO Update: విడుదలకు ముందే గ్రే మార్కెట్‌లో ఎల్‌ఐసీ షేర్ల సందడి.. 5 నుంచి 7 శాతం ప్రీమియంతో ట్రేడింగ్..

SBI: 31 పైసలు బకాయి ఉందంటూ నో డ్యూ సర్టిఫికేట్‌ ఇవ్వని బ్యాంక్.. ఆగ్రహించిన హైకోర్టు..