ఎలక్ర్టిక్ వాహనాల వినియోగంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆదివారం (ఫిబ్రవరి 5) హైదరాబాద్ వేదికగా ‘ర్యాల్-ఈ'( Rall-E) పేరుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ర్యాలీ జరగనుంది. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. సుమారు 1,000 నుంచి 1,200 వరకు ఎలక్ట్రానిక్ వెహికిల్స్ ఈ ర్యాలీలో పాల్గొంటాయని అంచనా. ఈనేపథ్యంలో ర్యాలీకి ఎలాంటి అంతరాయం కలగకుండా ర్యాలీ రూట్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.
ర్యాలీ రూట్స్ ఇవే..
రూట్-1
పీపుల్స్ ప్లాజా నుంచి.. ఖైరతాబాద్, సోమాజిగూడా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్, టీ-హబ్ మీదుగా.. బయో డైవర్సిటీ జంక్షన్ దగ్గర యూ-టర్న్, ఐకియా, లెమన ట్రీ జంక్షన్, సైబర్ టవర్స్, శిల్పారామం, మెటల్ చార్మినార్, ఖనామేట్ మీదుగా హైటెక్స్ వరకు..
రూట్-2
మియాపూర్ మెట్రో స్టేషన్ మీదుగా.. ఆల్విన్ ఎక్స్ రోడ్, హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్, ఆర్టీఏ ఆఫీస్, కొత్తగూడ జంక్షన్, సిఐఐ జంక్షన్, మెటల్ చార్మినార్, ఖానామేట్ మీదుగా హైటెక్స్ వరకు ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..