AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయ్… తెలుసుకోండి

ఆగస్టు 10న హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో జరిగే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందస్తు భద్రతా చర్యలతో సిటీ పోలీసులు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. గతేడాది పుష్ప 2 ఈవెంట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ఈసారి పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Hyderabad: వార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయ్... తెలుసుకోండి
Traffic Diversions
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 09, 2025 | 6:52 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీ రోల్‌లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ వార్-2. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ ఆదివారం (ఆగస్టు 11) యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్‌ బ్యాటిల్‌ఫీల్డ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గత ఏడాది పుష్ప-2 ప్రివ్యూ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అలాంటి ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు. అందులో భాగమే ఈ ట్రాఫిక్ డైవర్షన్స్.

ఏయే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి కోట్ల విజయభాస్కర్ స్టేడియం వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను కృష్ణానగర్ జంక్షన్ వద్ద నుంచి శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.

మైత్రివనం జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాధాపూర్ వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను యూసుఫ్‌గూడ బస్తీ వద్ద నుంచి ఆర్బీఐ క్వార్టర్స్ – కృష్ణానగర్ జంక్షన్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లిస్తారు.

మైత్రివనం నుండి బోరబండ బస్‌స్టాప్ వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను సవేరా ఫంక్షన్ హాల్ – కృష్ణకాంత్ పార్క్ – జీటీఎస్ టెంపుల్ – కల్యాణ్‌నగర్ – మోతినగర్ – బోరబండ బస్‌స్టాప్ వైపు మళ్లిస్తారు.

బోరబండ బస్‌స్టాప్ నుండి మైత్రివనం వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను ప్రైమ్ గార్డెన్ కల్యాణ్‌నగర్ – మిడ్‌లాండ్ బేకరీ – జీటీఎస్ కాలనీ – కల్యాణ్‌నగర్ జంక్షన్ – ఉమేష్ చంద్ర విగ్రహం యూటర్న్ – ఐసీఐసీఐ యూటర్న్ – మైత్రివనం జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఇక ఈ మూవీ వేడుకకు వచ్చే వాహనదారుల కోసం జనకమ్మతోట 1 & 2 (మెట్రో పార్కింగ్), యూసుఫ్‌గూడ, సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద ఫోర్-వీలర్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఈ నెల 14న విడుదల అవ్వనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ.. దీని ధర తెలిస్తే కంగు తినాల్సిందే!
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!
వీరికి ఆ బాధలు ఉండవ్..శని దేవుడే ఈ రాశులకు కొండంత అండ!
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
మీ ఫోన్‌లో తరచు నోటిఫికేషన్‌లతో చిరాకు పడుతున్నారా? ఈ ఫీచర్‌తో..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
బాబోయ్‌..గులాబీ రంగులోకి మారిపోయిన ఆకాశం..! అసలు ఏంటో తెలిస్తే..
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..