30 రోజులకు 32లక్షల బిల్లు వేసిన ఆసుపత్రి

కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాలు హెచ్చరించినా, ఆ ఆసుపత్రుల

30 రోజులకు 32లక్షల బిల్లు వేసిన ఆసుపత్రి
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2020 | 2:08 PM

Private Hospital high Fees: కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాలు హెచ్చరించినా, ఆ ఆసుపత్రుల తీరు మారడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఓ రోగికి 30 రోజులకు రూ.32లక్షల బిల్లు వేసింది. దానికి సంబంధించిన బిల్లు పేపర్‌ సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఈ అంశంపై ఆసుపత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి. ఆ వ్యక్తి నెలరోజులుగా తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన న్యూమోనియాతో పాటు సెప్టిక్ షాక్‌కు గురయ్యారు. కరోనా లేదు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో మూత్రపిండాలు పనిచేయడం లేదు. డయాలసిస్ చేస్తూ వెంటిలేటర్‌పై చికిత్స అందించాం. రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలిపాం అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Read This Story Also: రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం.. ఖలాసీ వ్యవస్థకు ముగింపు