AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణేష్ ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. నిత్యం వేలాది కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా బాధితులతో ఆస్పత్రులు నిండుతున్నాయి. దీంతో ప్రభుత్వం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని అంక్షలు విధించింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా రాబోయే గణేష్ ఉత్సవాలపై పడింది. ఉత్సవాలను ఏవిధంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్వహకులు తర్జనభర్జనలు పడుతున్నారు.

గణేష్ ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత
Balaraju Goud
|

Updated on: Aug 07, 2020 | 1:47 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. నిత్యం వేలాది కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనా బాధితులతో ఆస్పత్రులు నిండుతున్నాయి. దీంతో ప్రభుత్వం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని అంక్షలు విధించింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా రాబోయే గణేష్ ఉత్సవాలపై పడింది. ఉత్సవాలను ఏవిధంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్వహకులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్ లో గణేశ్‌ నవరాత్రోత్సవాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శనివారం ఈ సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోలీసు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా గణేశ్‌ ఉత్సవాల నిర్వహణ – తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వాహకుల సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఇక, తెలంగాణలో అత్యంత ప్రముఖమైన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ మొదలైంది. ఈసారి ఖైరతాబాద్ గణపతి 9 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈసారి పర్యావరణహితంగా ఖైరతాబాద్ వినాయకుడు రూపుదిద్దుకోబోతున్నాడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో దర్శనం కోసం భక్తులను అనుమతించటంలేదని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వెల్లడించింది. ఈసారి భక్తులు ఆన్‌లైన్‌లోనే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఈసారి మహావిష్ణువు రూపంలో ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు కనిపించనున్నారు.

ప్రధానంగా కరోనా నేపథ్యంలో ఉత్సవాలు నిర్వహించాలా.. వద్దా? అన్న విషయంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సామూహిక నిమజ్జనం నిర్వహించటం లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తి నెలకొంది.