కోహ్లీపై ఒత్తిడి తగ్గిస్తా.. ఫించ్ కామెంట్స్..

ఐపీఎల్ 13వ సీజన్‌కు రంగం సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో ఈ నెల 19న ఆటగాళ్లు అందరూ కూడా యూఏఈ పయనం కానున్నారు.

కోహ్లీపై ఒత్తిడి తగ్గిస్తా.. ఫించ్ కామెంట్స్..

Finch Comments: ఐపీఎల్ 13వ సీజన్‌కు రంగం సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో ఈ నెల 19న ఆటగాళ్లు అందరూ కూడా యూఏఈ పయనం కానున్నారు. బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ లీగ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆస్ట్రేలియా క్రికెట్ ఆరోన్ ఫించ్ ఆడనున్నాడు.

అతడు తాజాగా కోహ్లీపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ”తొలిసారిగా అర్సీబీ తరపున ఆడబోతున్నాను. ఈ క్షణం కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. విరాట్ కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం ద్వారా ఎన్నో మెలుకువలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా విరాట్‌కు ఒత్తిడి తగ్గిస్తానని” ఫించ్ చెప్పుకొచ్చాడు.

 

Click on your DTH Provider to Add TV9 Telugu