Medchal Robbery: మేడ్చల్‌ ఐటీకారిడార్‌లో భారీ చోరి.. రూ.2 కోట్ల నగదు, 28 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

|

Sep 22, 2024 | 1:37 PM

రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లు కాజేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి దాచుకున్న సొత్తును గుట్టు చప్పుడుకాకుడా కాజేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లాలో తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టారు దొంగలు. రూ.2 కోట్ల నగదుతోపాటు దాదాపు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన మేడ్చల్..

Medchal Robbery: మేడ్చల్‌ ఐటీకారిడార్‌లో భారీ చోరి.. రూ.2 కోట్ల నగదు, 28 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Medchal House Robbery
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లు కాజేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి దాచుకున్న సొత్తును గుట్టు చప్పుడుకాకుడా కాజేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లాలో తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టారు దొంగలు. రూ.2 కోట్ల నగదుతోపాటు దాదాపు 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్‌ ఠానా పరిధిలో భారీ చోరీ జరిగింది.

మేడ్చల్‌లోని చౌదరిగూడలోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తి తన ఇంటి‌ తాళం‌ వేసి పని నిమిత్తం బయటికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించి ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలో దాచిన రూ.2.2 కోట్ల డబ్బుతోపాటు పాటు 28 తులాలు బంగారు నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి వచ్చిన నాగ భూషణం ఇంటి తాళం పగలగొట్టి ఉండటం చూపి కంగారుగా ఇంట్లోకి వెళ్లి చూశాడు. బీరువాలో దాచుకున్న డబ్బు, నగలు మాయం అవడంతో లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలియజేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

కాగా ఇటీవల నాగభూషణం శంకర్‌పల్లిలో తన 10 ఎకరాల భూమి అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు అడ్వాన్స్‌గా ఇచ్చిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఇది తెలిసినవారి పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యం నాగభూషణం డ్రైవర్‌పై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ చోరీపై మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ.. చోరీ జరిగిందని ఆదివారం తెల్లవారు జామున పోచారం పోలీసులకు బాధితుడు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు, క్లూస్ టీం అంతా స్పాట్కు చేరుకుని.. చోరీ ఎలా జరిగిందనే దానిపై ఆరా తీసినట్లు చెప్పారు. నాగభూషణం కొడుకు హైదరాబాద్లో ఐటీ రంగంలో పని చేస్తున్నాడు. శంకర్పల్లిలో తమ భూమి అమ్మగా వచ్చిన డబ్బునే.. నాగభూషణం కొడుకు, కారు డ్రైవర్తో ఆ డబ్బులు ఇచ్చి హైదరాబాద్ నుంచి తండ్రి ఇంటికి పంపాడు. వేరే చోట భూమి కొనుగోలు చేసేందుకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుకున్నారు. అయితే ఇంతలోనే చోరీ జరిగిందని ఏసీపీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.