Hyd News: హైట్‌తో అవస్థలు పడుతున్న కండక్టర్..ఎందుకో చూడండి?
Hyderabad: చాంద్రాయణగుట్టలోని షాహీనగర్‌కు చెందిన అన్సారీ అనే వ్యక్తి మెహిదీపట్నం డిపోలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అన్సారీ ఎత్తు 7 అడుగులు..ఆరడుగుల ఎత్తున్న ఆర్టీసీ బస్సులో ఉద్యోగం చేయడం అన్సారీకి పెను సవాలుగా మారింది. బస్సులో రోజంతా అతని తల వంచి ప్రాయణించడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు.తనకు ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాదికారులను కోరుతున్నాడు

కొంత మంది పొట్టిగా ఉన్నామని చాలా బాధపడుతుంటారు..తాము కూడా ప్రభాస్‌లా హైట్ పెరగాలని..ఫిట్‌నెస్ పెంచుకోవాలని అనుకుంటారు. పొట్టిగా ఉండటం ఒక సమస్య అయితే.. ఎక్కువ హైట్ ఉండటం కూడా ప్రాబ్లమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎక్కవ హైట్ ఉన్నవారు కూడా తమ జీవితంలో ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎవరింటికైనా వెళ్తే గుమ్మంలో పట్టకపోవడం..లొపలికి వెళ్లేటప్పుడు గుమ్మం తలకు తగలడం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇవన్ని చిన్న చిన్న సమస్యలు.. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి తన హైటే ప్రధాన కారణంగా మారింది. తన హైట్ వల్ల ఆయన చేసే ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అసలు అతనికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
హైదరాబాద్ కు చెందిన అమీన్ అహ్మద్ అన్సారీ చాంద్రాయణగుట్టలోని షాహీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతని ఏడు అడుగుల హైట్ ఉంటాడు. అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా 2021లో ఆయన మృతి చెందాడు. దీంతో ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి కారుణ్య నియామకం కింద ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. మెహిదీపట్నం డిపోలో అన్సారీకి కండక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడే అతనికి అసలైన సమస్య వచ్చింది.
బస్సు ఎత్తేమో 6.4 అడుగులు..మనోడి హైట్ మాత్రం 7 అడుగులు. దీంతో బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వర్తించడం అన్సారీకి చాలా ఇబ్బందిగా మారింది. హైదరాబాద్ బస్సులో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..కండక్టర్లకు కనీసం కూర్చోవడానికి కూడా వీలు ఉండదు..దీంతో అన్సారీ రోజుకు సుమారు 8 నుంచి 10 గంటలు బస్సులో తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఈ సమస్యలతో తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్సారీ అవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తనకు ఆర్టీసీలోనే ఇంకేదైనా ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..