Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటమునిగిన రహదారులు! భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరమంతా దంచికొడుతోంది. ఉదయమంతా ఎండ వేడికి అల్లాడిన జనం వర్షం జల్లులతో సేద తీరారు. ఎల్‌బీనగర్, హయత్‌నగర్, గచ్చిబౌలి..

హైదరాబాద్, జూన్ 5: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరమంతా దంచికొడుతోంది. ఉదయమంతా ఎండ వేడికి అల్లాడిన జనం వర్షం జల్లులతో సేద తీరారు. ఎల్‌బీనగర్, హయత్‌నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శిల్పారామం, కొండాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బార్కస్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Enjoying the first rain of Monsoon 2024 ❤️
ఇవి కూడా చదవండిRain will continue till 6.30/7pm in marked areas of pinned post 👍 pic.twitter.com/Agj7Xd8s2A
— Telangana Weatherman (@balaji25_t) June 5, 2024
రహదారులపై మోకాళ్ల లోతు వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్లపై పలు చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
Heavy Rain now in Hitech City⛈️⚡️#HyderabadRains pic.twitter.com/98g0kor8Vo
— Hyderabad Rains (@Hyderabadrains) June 5, 2024
కాగా బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తన ప్రకటనలో పేర్కొంది. గురువారం కూడా ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 3 నుంచి 4 రోజులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.




