Hyderabad Rains: కూల్ న్యూస్.. తెలంగాణలో రుతుపవనాలు.. పలు చోట్ల వర్షాలు..
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. మరోవైపు.. మే 30వ తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ ఐదు, ఆరు తేదీల్లో విస్తరించనున్నాయి.
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. మరోవైపు.. మే 30వ తేదీన కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ ఐదు, ఆరు తేదీల్లో విస్తరించనున్నాయి. రుతుపవనాల రాకతోనే వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇక, హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.