Viral: ఘోర రైలు ప్రమాదం.. రెండు గూడ్స్‌ రైళ్లు ఢీ. ప్యాసింజర్‌ రైలు ఇంజిన్‌ బోల్తా..

పంజాబ్‌లోని మాధోపూర్, సిర్హింద్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.

Viral: ఘోర రైలు ప్రమాదం.. రెండు గూడ్స్‌ రైళ్లు ఢీ. ప్యాసింజర్‌ రైలు ఇంజిన్‌ బోల్తా..

|

Updated on: Jun 05, 2024 | 6:25 PM

పంజాబ్‌లోని మాధోపూర్, సిర్హింద్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రెండు రైళ్లలోని చాలావరకూ బోగీలు బోల్తాపడ్డాయి.. మరికొన్ని బోగీలు ఒకదానిపైకి ఒకటి చేరాయి. ప్రమాదంలో రెండు రైళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో అంబాలా నుంచి జమ్ముతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలు ఇంజన్ బోల్తా పడింది. దీంతో ఈ రైలుకు కూడా కొంత నష్టం వాటిల్లింది. ప్యాసింజర్ రైలులో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే సిబ్బంది కిటికీ అద్దాలు పగులగొట్టి ఇంజిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్లను బయటకు తీశారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైలుకు కొంత నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో మరో ఇంజన్‌ను అమర్చి రైలును రాజ్‌పురా వైపు పంపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us