Chang’e-6: చైనా ప్రయోగం సక్సెస్‌.. జాబిల్లి అవతలివైపు ల్యాండ్‌ అయిన చాంగే-6..!

చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్‌ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి అవతలివైపు ల్యాండ్‌ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలోని అయిట్కిన్‌ బేసిన్‌ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు.

Chang'e-6: చైనా ప్రయోగం సక్సెస్‌.. జాబిల్లి అవతలివైపు ల్యాండ్‌ అయిన చాంగే-6..!

|

Updated on: Jun 05, 2024 | 6:19 PM

చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్‌ చాంగే-6 విజయవంతంగా జాబిల్లి అవతలివైపు ల్యాండ్‌ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలోని అయిట్కిన్‌ బేసిన్‌ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముందడుగు. ఇప్పటి వరకు ప్రయోగించిన వాటిల్లో ఇదే అత్యాధునికమైంది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరుతుంది. గతంలో 2019లో కూడా చైనా చాంగే-4ను చంద్రుడి ఆవలివైపునకు ప్రయోగించింది. తాజాగా పంపిన ఈ మెషిన్‌లో ఆర్బిటర్‌, ల్యాండర్‌, అసెండర్‌, రీఎంట్రీ మాడ్యూల్‌ అనే నాలుగు రకాలున్నాయి.

మే 3వ తేదీ చాంగే-6 నింగికెగిరి.. దాదాపు 53 రోజులపాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. అక్కడ రోబోల సాయంతో తవ్వకాలు జరిపి అక్కడి మట్టిని భూమిపైకి తీసుకురానుంది. ఇందుకోసం సుమారు 14 గంటల సమయం పట్టనుంది. ఆ తర్వాత అసెండర్‌ మాడ్యూల్‌.. చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళుతుంది. చంద్రుడి కక్ష్యలోని ఆర్బిటర్‌తో అనుసంధానమవుతుంది. అనంతరం ఈ శాంపిళ్లు ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్‌లోకి చేరుతాయి. ఆర్బిటర్‌ భూమి దిశగా పయనాన్ని ఆరంభిస్తుంది. పుడమికి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్‌.. ఆర్బిటర్‌ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చైనాలోని ఇన్నర్‌ మంగోలియా అటానమస్‌ ప్రాంతంలో రీ ఎంట్రీ మాడ్యూల్‌ దిగుతుంది. చాంగే-6తో కమ్యూనికేషన్లు సాగించడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి చైనా ఇప్పటికే పంపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2030న అక్కడికి వ్యోమగాములను పంపేందుకు యత్నాలను వేగవంతం చేయనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us