Hyderabad: ఒక్క రోజులో హైదరాబాద్ మొత్తం చుట్టేయాలా.? మీ కోసమే ఈ టూర్ ప్యాకేజీ..
ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఓ మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌లో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలు కవర్ అయ్యేలా ఈ టూర్ ప్యాకేజీనీ తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ సిటీ టూర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఎలా ఉన్నాయో....

హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఐటీ మొదలు పర్యాటకం వరకు ఎన్నో విశేషాలకు నెలవు ఈ పట్టణం. హైదరాబాద్‌ను సందర్శించడానికి దేశ నలుమూలల నుంచి ఆ మాటకొస్తే విదేశీయులు కూడా వస్తుంటారు. హైదరాబాద్‌లో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు, వంటకాలు టూరిస్టులను రా రమ్మంటూ ఆహ్వానిస్తుంటాయి. హైదరాబాద్‌లో ఎన్నో ప్రదేశాలు ఉంటాయి. మరి వాటన్నింటినీ ఒక్కరోజులో చుట్టేసి రావడం కాస్త కష్టంతో కూడుకున్న అంశం.
ఇలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఓ మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌లో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలు కవర్ అయ్యేలా ఈ టూర్ ప్యాకేజీనీ తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ సిటీ టూర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో టికెట్స్ ముందస్తుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజీ ధర విషయానికొస్తే నాన్ ఏసీ పెద్దలకు రూ. 380 చిన్నారులకు రూ. 300గా నిర్ణయించారు. ఇక ఏసీ విషయానికొస్తే చిన్నారులకు రూ. 400, పెద్దలకు రూ. 500గా నిర్ణయించారు. భోజనం ఖర్చు పర్యాటకులు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజీలో కవర్ కాదు.
ఇక టూర్ ప్రతీ రోజూ ఉయదం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ ఎస్‌పీ రోడ్డులోని యాత్రి నివాస్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. ఇక 7.45 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజా నుంచి బయలు దేరుతుంది. అలాగే బహీష్‌బాగ్ నుచి ఉదయం 8.15 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ప్యాకేజీలో భాగంగా బిర్లామందిర్, చౌమహల్లా ప్యాలెస్ (శుక్రవారం సెలవు), చార్మినార్, మక్కా మజిద్, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలర్జంగ్ మ్యూజియం (శుక్రవారం సెలవు), నిజాం మ్యూజియం (శుక్రవారం సెలవు), నెహ్రు జూపార్క్, గోల్కోండ ఫోర్ట్, కుతుబ్ షాహీ సమాధులు వంటి ప్రదేశాలు కవర్ అవుతాయి. ఇక జూపార్క్ కేవలం శుక్రవారం మాత్రమే విజిటింగ్ ఉంటుంది. చివరిగా రాత్రి 7.30 గంటలకు ఐమాక్స్ వద్ద దించుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




