AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాట్సాప్‌లో హైదరాబాద్ మెట్రో ట్రైన్‌ టికెట్‌ బుకింగ్.. ఎలా చేసుకోవాలో తెలుసా.?

ఇక టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్న హైదరాబాద్ మెట్రోరైల్ ట్రైన్‌ టికెట్ బుకింగ్ విషయంలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. స్టేషన్‌లో క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండా ఫోన్‌లోనే యాప్‌ల ద్వారా టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తాజాగా నేరుగా వాట్సాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకొచ్చారు....

Hyderabad: వాట్సాప్‌లో హైదరాబాద్ మెట్రో ట్రైన్‌ టికెట్‌ బుకింగ్.. ఎలా చేసుకోవాలో తెలుసా.?
Hyderabad Metro
Narender Vaitla
|

Updated on: Mar 08, 2024 | 2:17 PM

Share

మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాదీలకు ప్రయాణం సులభతరమైంది. ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తప్పించుకొని ఎంచక్కా వేగంగా గమ్యస్థాలకు చేరుకుంటున్నారు. ఒకప్పుడు గంటలు పట్టిన ప్రయాణ సమయం ఇప్పుడు భారీగా తగ్గిపోయింది.

ఇక టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్న హైదరాబాద్ మెట్రోరైల్ ట్రైన్‌ టికెట్ బుకింగ్ విషయంలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. స్టేషన్‌లో క్యూ లైన్లలో నిలబడే అవసరం లేకుండా ఫోన్‌లోనే యాప్‌ల ద్వారా టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తాజాగా నేరుగా వాట్సాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం తీసుకొచ్చారు. ఇంతకీ వాట్సాప్‌లో మెట్రో టికెట్‌ ఎలా బుక్‌ చేసుకోవాలి.? ఇందుకోసం పాటించాల్సిన స్టెప్స్‌ ఏంటో.? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 918341146468 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. అనంతరం మీ వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్ చేసిన పైన పేర్కొన్న నెంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ చేయాలి.

* వెంటనే మీకు ఒక ఓటీపీతో పాటు ఈ టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి ఒక యూఆర్‌ఎల్ గేట్‌వే వస్తుంది.

* ఈ టికెట్‌ బుకింగ్ యూఆర్‌ఎల్‌ లింక్‌పై క్లిక్‌ చేయగానే డిజిటల్‌ గేట్‌వే వెబ్ పేజీ ఓపెన్‌ అవుతుంది.

* ఇందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీ ప్రయాణ వివరాలు ఎంటర్‌ చేసి. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎమ్‌, రూపే డెబిట్‌ కార్డు వంటి వాటితో పేమెంట్ చేయాలి.

* పేమెంట్‌ కంప్లీట్ కాగానే మీకు మీ వాట్సాప్‌కు ఈ టికెట్‌ యూఆర్‌ఎల్ వస్తుంది.

* ఈ టికెట్‌ యూఆర్‌ఎల్ డౌన్‌లోడ్‌ చేసుకొని స్టేషన్‌లో క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేస్తే సరిపోతుంది. టికెట్‌ జనరేట్ అయిన తర్వాత 24 గంటలోపు ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి