AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ – శ్రీశైలం టూరిజం ప్యాకేజీ.. ధర కేవలం రూ. 2 వేలు మాత్రమే, పూర్తి వివరాలు.

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. ముఖ్యంగా వీకెండ్స్‌ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న హైదరాబాదీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం టూర్‌ వెళ్లాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది....

Hyderabad: హైదరాబాద్‌ - శ్రీశైలం టూరిజం ప్యాకేజీ.. ధర కేవలం రూ. 2 వేలు మాత్రమే, పూర్తి వివరాలు.
Srisailam Temple
Narender Vaitla
|

Updated on: May 27, 2023 | 6:43 PM

Share

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. ముఖ్యంగా వీకెండ్స్‌ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న హైదరాబాదీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం టూర్‌ వెళ్లాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ ఖర్చులో రెండు రోజుల పాటు ఈ టూర్‌ సాగుతుంది. ప్రతీ రోజూ ఈ టూర్‌ ఉంటుంది. ఇంతకీ ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..

టూర్ ఇలా సాగుతుంది..

మొదటి రోజు: తొలి రోజు ఉదయం 8.30 గంటలకు టూర్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని పర్యాటక్‌ భవన్‌ నుంచి 8.30 గంటలకు బస్సు బయలు దేరుతుంది. అనంతరం ఉదయం 9.00 గంటలకు బషీర్‌భాగ్‌లోని సీఆర్‌ఓ ఆఫీస్‌ వద్ద బస్సు ఆగుతుంది. శ్రీశైలంకు వెళ్లే దారిలోనే భోజనం చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. దారి మధ్యలో సాక్షి గణపతి గుడి దర్శనం ఉంటుంది. రాత్రి హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.

రెండో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయగానే రోప్‌ వే, పాలదార, పంచదార, శిఖరం, డ్యామ్‌ల సందర్శన ఉంటుంది. పర్యాటకులు తమ సమయానికి అనుగుణంగా దేవాలయ సందర్శన చేసుకోవాల్సి ఉంటుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ఈ టూర్‌ ప్యాకేజీలో రెండు రకాల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సు ప్యాకేజీ, నాన్‌ ఏసీ అకామిడేషన్‌ ధర పెద్దలకు రూ. 2400 కాగా చిన్నపిల్లలకు రూ. 1920గా ఉంది. ఇక నాన్‌ ఏసీ బస్సు, నాన్‌ ఏసీ అకామిడేషన్‌ పెద్దలకు రూ. 2000, చిన్నారులకు రూ. 1600గా ఉంది.

నోట్‌: ట్రాన్స్‌పోర్టేషన్‌, అకామిడేషన్‌ ప్యాకేజీలో భాగమే. ఫుడ్‌, దర్శనంతో పాటు ఇతర ఖర్చులు ప్యాకేజీలో కవర్ కావు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
పాత బాటిళ్లను కొత్తవాటిలా.. స్టిక్కర్ జిగురు వదిలించే ట్రిక్
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్‌ వస్తుంది
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నోరూరించే గోంగూర, మటన్ బోటి
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
3 లక్షలకుపైగా స్కూటర్ల రీకాల్‌.. ఇందులో మీ స్కూటర్‌ కూడా ఉందా?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
CPRతో పునర్ జన్మ.. ఎమర్జెన్సీ టైంలో ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయాలంటే?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
రథ సప్తమి రోజున తప్పక చేయాల్సినవి.. చేయకూడనవి తెలుసా?
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
30 రోజులు ఈ ఆసనం వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఫుల్ ఖుష్!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
కంప్యూటర్ క్లాస్ నుండి వస్తుండగా..!
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నైన్టీస్ కిడ్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీరియల్ సాంగ్.. ❤️
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..
నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే..