ICCC at Banjara Hills: పోలీసులకు ప్రధాన అస్త్రంగా మారిన నిఘానేత్రాలు.. గణేశ్‌ నిమజ్జనంలో పూర్తిస్థాయి వినియోగం

| Edited By: Srilakshmi C

Oct 01, 2023 | 1:11 PM

హైదరాబాదులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కంప్లీట్ చేశారు పోలీసులు. అయితే నిమజ్జనం ఇంత సక్సెస్ కావటానికి పోలీసుల ప్రధాన అస్త్రం కమాండ్ కంట్రోల్ సెంటర్. అసలే 90 వేలకుపైగా విగ్రహాలు, అందులోనూ మిలాద్ ఉబ్ నబీ రోజున గణేష్ నిమజ్జనం.. ఏదోలా ముస్లింల ర్యాలీని వాయిదా వేయించినప్పటికీ నిమజ్జనం సక్సెస్ ఫుల్ గా సజావుగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు.... వీటన్నిటిని తోసిపుచ్చుతు దాదాపు 50 వేల మంది పోలీసులు, లక్షలాది..

ICCC at Banjara Hills: పోలీసులకు ప్రధాన అస్త్రంగా మారిన నిఘానేత్రాలు.. గణేశ్‌ నిమజ్జనంలో పూర్తిస్థాయి వినియోగం
ICCC at Banjara Hills
Follow us on

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: హైదరాబాదులో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కంప్లీట్ చేశారు పోలీసులు. అయితే నిమజ్జనం ఇంత సక్సెస్ కావటానికి పోలీసుల ప్రధాన అస్త్రం కమాండ్ కంట్రోల్ సెంటర్. అసలే 90 వేలకుపైగా విగ్రహాలు, అందులోనూ మిలాద్ ఉబ్ నబీ రోజున గణేష్ నిమజ్జనం.. ఏదోలా ముస్లింల ర్యాలీని వాయిదా వేయించినప్పటికీ నిమజ్జనం సక్సెస్ ఫుల్ గా సజావుగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు…. వీటన్నిటిని తోసిపుచ్చుతు దాదాపు 50 వేల మంది పోలీసులు, లక్షలాది కెమెరాలు, 354 కిలోమీటర్ల శోభాయాత్ర… ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా సజావుగా నిమర్జనం కంప్లీట్ చేశారు. గణేష్ నిమజ్జనం ఈ రేంజ్ లో సక్సెస్ కావడానికి ముఖ్యపాత్ర పోషించింది మాత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్.

2022 ఆగస్టు 4వ తారీఖున బంజారహిల్స్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన నాటి నుంచి అన్ని పరికరాలు సమకూర్చుకొని పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది మాత్రం ఈ నిమజ్జనంతోనే. దాదాపు సంవత్సరం క్రిందటే ఇక్కడి నుంచి పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఈ సెంటర్ కు కావలసిన పరికరాలన్ని కాస్త లేటుగా వచ్చాయి. గతంలో వరదల సమయంలో ఇది పూర్తిగా అందుబాటులోకి రాలేదనీ పలువురు విమర్శలు కూడా చేశారు. అయితే వాటన్నిటిని తలదన్నుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పూర్తిస్థాయిలో నిమజ్జనానికి వినియోగించారు.

రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీతో పాటు డీజీపీ అంజని కుమార్, ఇతర ఉన్నతాధికారులందరూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనానికి రెండు రోజుల ముందు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. నిమజ్జనం మొదలైన నాటి నుంచి ముగిసే వరకు లక్షలాది సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి సిబ్బందిని పంపిస్తూ నిమజ్జనం సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసులు ప్రతి చోటకి వెళ్లి స్పాట్ ను సందర్శించే బదులు చాలా టెక్నికల్ గా వ్యవహరించి సీసీ కెమెరాల సహాయంతో టెక్నికల్ పోలీసింగ్ చేశారు సిటీ కాప్స్.

ఇవి కూడా చదవండి

నగరంలో ఏదైనా ఇంపార్టెంట్ ఉత్సవాలు జరిగినప్పుడు ఈ కమాండ్ కంట్రోల సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని దీని ప్రారంభోత్సవంలో ఉన్నతాధికారులు తెలియజేశారు. అయితే ఆచరణలోకి వచ్చింది మాత్రం ఈ ఏడాది గణేష్ నిమజ్జనంతోనే. సిటీలో చిన్నచిన్న గల్లీలలోను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలే పోలీసులకు ఇప్పుడు ప్రధాన అస్త్రాలుగా మారాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టుతో పాటు కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటులో భాగంగా ఒకేసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి 108 కెమెరాల ఫుటేజ్ వీక్షించేలా దేశంలోనే అతిపెద్ద సెంటర్ ను ఏర్పాటు చేశారు. భారీ ఉత్సవాల సందర్భంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్లోని 7 వ అంతస్తులో ఉన్న వారు రూమ్‌కు చేరుకుంటారు.అక్కడి నుండి పర్యవేక్షణ చేసి ఉత్సవం సక్సెస్ ఫుల్ గా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.