Hyderabad: ‘ఓవర్ చేస్తే.. తోలు తీస్తాం…’.. వారికి హైదరాబాద్ పోలీసుల స్ట్రైయిట్ వార్నింగ్

సెప్టెంబర్ 17. తెలంగాణ అందునా హైదరాబాద్‌లో బిగ్ డే. జాతీయ సమైక్యత దినోత్సవం అని తెలంగాణ సర్కార్ అంటుంది.. తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ పేర్కొంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టులతో శాంతిభద్రతలు డిస్టబ్ చేసేవారిపై నజర్ పెట్టింది హైదారాబాద్ పోలీస్ శాఖ.

Hyderabad: 'ఓవర్ చేస్తే.. తోలు తీస్తాం...'.. వారికి హైదరాబాద్ పోలీసుల స్ట్రైయిట్ వార్నింగ్
Hyderabad Police
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 15, 2022 | 11:56 AM

Telangana: తెలంగాణ రాజకీయం రంజుమీదుంది. విమోచన సంబరాలపై సెగ రాజుకుంటూనే ఉంది. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు.. అన్ని రాజకీయ పార్టీలూ ఉత్సవాలపై వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. దీంట్లో ముందువరుసలో ఉంది కమల దళం. విమోచనంపై మొండిగా ముందుకెళ్తున్న కాషాయ పార్టీ ఉత్సవాలపై అంతే అగ్రెసివ్‌గా అడుగులు వేస్తోంది. విమోచన సంబరాల్ని ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయింది బీజేపీ. ఇందులో భాగంగా ర్యాలీ చేపట్టారు కిషన్‌ రెడ్డి. కాగా సెప్టెంబర్ 17న పరేడ్‌గ్రౌండ్‌లో‌ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ‌ మంత్రి అమిత్ షా(Amit shah) వస్తున్నారు. అదే రోజున ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం సభ నిర్వహిస్తోంది.

సెప్టెంబర్‌ 17 సందర్భంగా హైదరాబాద్‌లో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సెక్యూరిటీ టైట్‌ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ సర్కార్‌ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది. అటు.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా BJP జరుపుతోంది. ఈ పోటా పోటీ కార్యక్రమాలతో ఎక్కడా ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సిటీ పౌరులను అలెర్ట్ చేసింది పోలీస్ శాఖ.  శాంతియుతంగా సెప్టెంబర్ 17 వేడుకలు జరుపుకోవాలని కోరింది. సోషల్ మీడియాలో అతి చేసే వాళ్లపై నజర్ పెట్టామని.. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.  ఉద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అల్లర్ల చేసి.. రచ్చ చేస్తే..  ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే