Hyderabad: నిర్మాత సురేష్ బాబు ఫిలిం నగర్ వివాదం పై కోర్ట్ సీరియస్.. ధనవంతులు కాబట్టే ఇలా చేశారా అంటూ

ఫిలిం నగర్ లో నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి ల్యాండ్ ఉంది. దాన్ని ఎంఎల్ఏ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ లీజ్‌కు తీసుకున్నాడు. అక్కడ డెక్కన్ కిచన్ పేరుతో హోటల్ ఏర్పాటు చేశాడు నంద కుమార్. ఆ తరువాత సురేష్ బాబు కుటుంబానికి, నంద కుమార్‌కు విబేధాలు ఏర్పడ్డాయి.. విబేధాల కారణంగా హోటల్ నిర్మాణం అక్రమం అని...

Hyderabad: నిర్మాత సురేష్ బాబు ఫిలిం నగర్ వివాదం పై కోర్ట్ సీరియస్.. ధనవంతులు కాబట్టే ఇలా చేశారా అంటూ
TS Highcourt

Edited By: Narender Vaitla

Updated on: Jul 13, 2023 | 1:19 PM

ఫిలిం నగర్ లో నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి ల్యాండ్ ఉంది. దాన్ని ఎంఎల్ఏ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ లీజ్‌కు తీసుకున్నాడు. అక్కడ డెక్కన్ కిచన్ పేరుతో హోటల్ ఏర్పాటు చేశాడు నంద కుమార్. ఆ తరువాత సురేష్ బాబు కుటుంబానికి, నంద కుమార్‌కు విబేధాలు ఏర్పడ్డాయి.. విబేధాల కారణంగా హోటల్ నిర్మాణం అక్రమం అని GHMC అధికారులకు ఫిర్యాదు చేశాడు నిర్మాత సురేష్ బాబు.

నిర్మత సురేష్ బాబు ఫిర్యాదు చేయగానే, హోటల్ కూల్చేశారు జిహెచ్ఎంసి అధికారులు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హోటల్ కూల్చడం , పైగా లీజ్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తన హోటల్ కూల్చడం పట్ల నందకుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో నేరుగా కోర్టుకు హాజరు కావాలని గతంలో నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఒకసారి నాంపల్లి కోర్టులోను హాజరయ్యాడు హీరో దగ్గుబాటి రానా.

ధనవంతులు కాబట్టే ఇలా చేశారా: హై కోర్ట్

హోటల్ కూల్చకుండా కోర్టు మద్యంతర ఉత్తరాలు జారీ చేసింది. కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకోకుండా నందకుమార్ డక్కన్ కిచెన్ హోటల్లో కూల్చేశారు జిహెచ్ఎంసి అధికారులు. అది కూడా భారీ పోలీస్ ప్రొటెక్షన్ నడుమ ఆదివారం రోజు అధికారులు కూల్చేశారు. దీంతో హైకోర్టులో కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు నందకుమార్. పిటిషన్ ను విచారించిన హైకోర్టు హోటల్ కూల్చివేతను తీవ్రంగా పరిగనించింది. ఆదివారం రోజు ఎలా కూల్చివేతలు చేస్తారంటూ హైకోర్టు అధికారుల పై మండి పడింది. అధికారులను నేరుగా హాజరు కావాలని కోర్ట్ నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులుగా ఉన్న సురేష్ బాబు, రానా, వెంకటేష్ లకు సైతం నోటీసులు పంపింది హై కోర్టు.

ఇవి కూడా చదవండి

హైకోర్టు ముందు విచారణకు హాజరయ్యారు జిహెచ్ఎంసి మాజీ కమిషనర్ లోకేష్. కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. అవతాల పార్టీ ధనవంతులు కాబట్టే కోర్ట్ అదేశాలు లెక్క చేయలేదు అంటూ హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనవంతులకు ఒక న్యాయం సామాన్యులకు మరో న్యాయమా అని అసంతృప్తి వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..