Telangana: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది ఐఏఎస్‌ అధికారులకు బదిలీ, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం....

Telangana: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ
Smita Sabharwal - CS A Santhi Kumari
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2024 | 5:47 PM

తెలంగాణలో భారీగా IAS అధికారులు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. మొత్తం 26 మంది IASలను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్‌ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్, సాగు నీటి శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించారు.

  • ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్‌
  • గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కా
  • నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా
  • పురావస్తుశాఖ డైరెక్టర్‌గా భారతి హోళికేరి
  • ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్‌ నజీద్‌
  • జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్‌రావు
  • బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం
  • ఆయుష్‌ డైరెక్టర్‌గా ఎం.ప్రశాంతి
  • పంచాయతీరాజ్‌, ఆర్‌డీ కార్యదర్శిగా  సందీప్‌ సుల్తానియా
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంక
  • ఫైనాన్స్‌, ప్లానింగ్‌ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్‌
  • జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బి.ఎం.సంతోష్‌
  • నల్గొండ కలెక్టర్‌గా హరిచందన
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి
  • మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా అద్వైత్‌ కుమార్‌ సింగ్‌
  • కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య
  • పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి
  • పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్‌
  • టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఆర్‌.వి.కర్ణన్‌
  • మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్‌
  • సీఎంవో జాయింట్‌ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ
  • ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్ నియామకం
  • సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు
  • డి. దివ్య – ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ మున్సిపల్‌
  • మైనార్టీస్‌ సెక్రటరీగా అయేషా మస్రత్‌ ఖానమ్‌
  • జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌‌గా అభిలాష అభినవ్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి