“ఓవర్ స్పీడ్” మంత్రులు.. చలాన్ల జోరు.. చోద్యం చూస్తున్న ఖాకీలు..
ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన.. కొత్త చట్టం అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. అయితే తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు. చట్టాలను రూపకల్పన చేసే తమకు చట్టం వర్తించదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వాహనాలను ఓవర్ స్పీడ్‌లో నడిపిస్తూ.. రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. తాజాగా తెలంగాణలోని కొందరు మంత్రుల వాహనాలపై ఉన్న జరిమానాలను పరిశీలించిన అధికారులు షాక్‌కు గురయ్యారు. కాగా, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల వాహనాలు కూడా పరిమితికి మించిన […]

ట్రాఫిక్ నిబంధనలను కఠిన తరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన.. కొత్త చట్టం అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. అయితే తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు. చట్టాలను రూపకల్పన చేసే తమకు చట్టం వర్తించదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వాహనాలను ఓవర్ స్పీడ్‌లో నడిపిస్తూ.. రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. తాజాగా తెలంగాణలోని కొందరు మంత్రుల వాహనాలపై ఉన్న జరిమానాలను పరిశీలించిన అధికారులు షాక్‌కు గురయ్యారు. కాగా, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల వాహనాలు కూడా పరిమితికి మించిన వేగంతో వెళుతూ సీసీ కెమెరాలకు దొరికిపోతున్నాయి. దీంతో పోలీసులు ఆయా మంత్రులకు చలాన్లు పంపినా వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కాగా, ఈ లిస్టులో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి, ఈటెల రాజేందర్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే హై స్పీడ్‌లో వెళుతూ సామాన్యులు పట్టుబడితే మాత్రం ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద కూడా జరిమానాలు వసూలు చేయాలన్నది సామాన్య ప్రజల డిమాండ్.