AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హుజూర్ నగర్ లో గెలుపు టీఆర్ఎస్ కు అగ్ని పరీక్షే !

తెలంగాణాలో హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు జరిగే ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రిస్టేజీ ఇష్యూగా మారింది. ఇదివరకటి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను ఈ పార్టీ కోల్పోయింది. దీంతో ఈ బై పోల్ లో హుజూర్ నగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి […]

హుజూర్ నగర్ లో గెలుపు టీఆర్ఎస్ కు అగ్ని పరీక్షే !
Anil kumar poka
| Edited By: |

Updated on: Sep 24, 2019 | 2:47 PM

Share

తెలంగాణాలో హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు జరిగే ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రిస్టేజీ ఇష్యూగా మారింది. ఇదివరకటి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను ఈ పార్టీ కోల్పోయింది. దీంతో ఈ బై పోల్ లో హుజూర్ నగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించడంతో.. ఈ స్థానానికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గానికి నోటిఫికేషన్ సోమవారం జారీ అయింది. ఇక్కడినుంచి తెరాస అభ్యర్థిగా ఎస్.సైదిరెడ్డి పేరును కేసీఆర్ ప్రకటించారు. సైదిరెడ్డి గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 7 వేల ఓట్లతేడాతో ఓడిపోయారు. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన అనంతరం కేసీఆర్.. ప్రచార వ్యూహాన్ని రూపొందించారు. హుజూర్ నగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఆయన తన కేబినెట్ లోని సుమారు ఆరుగురు మంత్రులకు, మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. జి.జగదీశ్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా మరికొంతమంది ఇక హుజూర్ నగర్లోనే ‘ మోహరించనున్నారు ‘. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కూడా అయిన కేటీఆర్.. ఈ నియోజకవర్గంలో ప్రచార సభలను, రోడ్ షోలను నిర్వహించనున్నారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు కూడా ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయనున్నారు.

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి, వి.చందర్ రావు, ఇతర సీనియర్ నేతలు సైతం హుజూర్ నగర్లో విస్తృత ప్రచారానికి రెడీ అవుతున్నారు. మరోవైపు టీపీసీసీ కూడా తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిపక్షాలు, ఇతర సంస్థల మద్దతును కోరుతోంది. ఈ నియోజకవర్గం విజయం తెరాసకు ఎంత ముఖ్యమో, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఇక్కడ తమ పార్టీ అభ్యర్థి విజయం అంతే ముఖ్యం. (ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి పేరు ఖరారు అయినట్టు సమాచారం). ఉత్తమ్.. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండ రామ్, అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మందకృష్ణ మాదిగ సపోర్టును కోరుతున్నారు. ఇలాఉండగా.. హుజూర్ నగర్ మాజీ తెరాస ఇన్-ఛార్జి, తెలంగాణ కోసం బలిదానం చేసిన కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ. ఈ ఉపఎన్నికలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా బీజేపీ నేతలను కోరుతున్నట్టు తెలిసింది. అయితే బీజేపీ తమ అభ్యర్థిగా శ్రీకళారెడ్డిని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.