అద్భుతమైన మ్యాచ్.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో టాస్మానియా వెర్సస్ విక్టోరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టాస్మానియా బౌలర్ల దాటికి మొదట బ్యాటింగ్ చేసిన విక్టోరియా 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆ సమయంలో 66 బంతులకు 5 పరుగులు చేయాల్సి ఉంది. దీనితో టాస్మానియా జట్టు విజయం నల్లేరు మీద నడకే […]

  • Ravi Kiran
  • Publish Date - 2:03 pm, Tue, 24 September 19
అద్భుతమైన మ్యాచ్.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో టాస్మానియా వెర్సస్ విక్టోరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టాస్మానియా బౌలర్ల దాటికి మొదట బ్యాటింగ్ చేసిన విక్టోరియా 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆ సమయంలో 66 బంతులకు 5 పరుగులు చేయాల్సి ఉంది. దీనితో టాస్మానియా జట్టు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా.. అయితే అనూహ్యంగా ఆ జట్టు పది బంతుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లు కోల్పోయి కేవలం మూడు పరుగులే చేసి ఓటమిపాలైంది. విక్టోరియా పేసర్ జాక్సన్ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపగా.. చివరి రెండు వికెట్లను ఫాస్ట్ బౌలర్ క్రిస్ పడగొట్టి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ భయంకరమైన లోయర్ ఆర్డర్ కొలాప్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.