ధావన్‌పై వేటు… ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ.?

కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును ప్రక్షాళన చేసేందుకు సిద్దమయ్యాడు. ఇటీవల సఫారీలతో జరిగిన మూడో టీ20 ఓటిమి తర్వాత టీమ్‌లోని డొల్లతనం మరోసారి స్పష్టమైంది. ‘జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అందువల్ల ప్రయోగాలు చేస్తుంటాం అని కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్ అయింది. ఇప్పుడు భారత్ దృష్టి అంతా వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌పై ఉంది. అందుకే కెప్టెన్ […]

ధావన్‌పై వేటు... ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ.?
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 24, 2019 | 11:33 AM

కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును ప్రక్షాళన చేసేందుకు సిద్దమయ్యాడు. ఇటీవల సఫారీలతో జరిగిన మూడో టీ20 ఓటిమి తర్వాత టీమ్‌లోని డొల్లతనం మరోసారి స్పష్టమైంది. ‘జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అందువల్ల ప్రయోగాలు చేస్తుంటాం అని కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్ అయింది. ఇప్పుడు భారత్ దృష్టి అంతా వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌పై ఉంది. అందుకే కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బలమైన టీమ్‌ను సన్నద్ధం చేసే పనిలో పడ్డాడు.

వన్డే ప్రపంచకప్ గురించి మాట్లాడుకుంటే.. ఓపెనర్లతో పాటుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు ప్రధాన బలం.  వీరి ముగ్గురు కూడా ఒక్క ఇండియాలోనే మాత్రం కాదు విదేశాల్లో కూడా అత్యుత్తమమైన ఆటతీరును కనబరుస్తూ.. ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా వన్డేల మాదిరిగానే టీ20లను భారత్ పొడిగిస్తూ వచ్చింది. ఇక ఆ ముగ్గురు ప్లేయర్స్‌.. ఈ రెండు ఫార్మాట్లలోనూ కొనసాగుతూ వచ్చారు. అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు కూడా వీరినే కంటిన్యూ చేయాలా.. లేదా ఆ స్థానాల్లో మరొకరిని బరిలోకి దింపాలా అనే ప్రాధమిక చర్చలు జరుపుతున్నట్లు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ వెల్లడించాడు.

Top three in T20Is post WT20 2016

Team Mat Runs HS Avg SR 100s 50s
England 22 1888 78 30.95 141.21 0 13
Ireland 14 1017 91 25.42 141.05 0 5
Australia 27 2198 172 29.30 140.80 2 10
India 47 4172 118 33.91 139.71 4 27
New Zealand 28 2243 109* 28.03 138.45 4 15
Bangladesh 27 1657 77 20.97 133.95 0 8
Sri Lanka 33 2166 79 22.10 133.86 0 14
South Africa 24 2036 85 30.38 132.29 0 16
Afghanistan 22 1746 162* 28.16 131.08 1 8
West Indies 35 2091 125* 21.78 125.58 2 7
Pakistan 32 2828 97* 33.66 125.24 0 19
Zimbabwe 17 1029 94 21.00 114.07 0 5

2016 టీ20 వరల్డ్‌కప్ నుంచి చూసుకుంటే.. టీమిండియా టాప్ 3 ప్లేయర్స్‌కు గత 47 ఇన్నింగ్స్‌లో 139.71 స్ట్రైక్ రేట్‌ ఉంది. అంతేకాకుండా టాప్ 3లో ప్లేయర్స్‌లో రోహిత్ శర్మ మూడు సెంచరీలు చేయగా.. రాహుల్ ఒక్క సెంచరీ నమోదు చేశాడు. ఇంత అద్భుతమైన స్ట్రైక్ రేట్, ప్లేయర్స్ ఉండగా.. టీమిండియాకు ఎక్కడ ఇబ్బంది వస్తోందని అనుకుంటున్నారా.?

టీమిండియాకు ఎప్పటి నుంచో మిడిల్ ఆర్డర్ వెంటాడుతున్న సమస్య. ఎంతోమంది ప్లేయర్స్‌ను ట్రై చేసినా.. ఒక్కరు కూడా నిలకడగా ఆడలేదు. మొత్తమంతా టాప్ త్రీ ప్లేయర్స్‌పైనే భారం పడుతోంది. అంతేకాకుండా నిలకడలేమి పెద్ద.. యువ ఆటగాళ్లపై ఒత్తిడి జట్టు ఓడిపోవడానికి కారణాలు అవుతున్నాయి.

Team Inngs Avg RR BpW BpB
England 22 35.66 8.64 24.8 4.4
Australia 27 34.05 8.62 23.7 4.8
Ireland 14 27.77 8.60 19.4 4.6
Sri Lanka 33 24.88 8.55 17.5 4.8
Bangladesh 27 20.39 8.43 14.5 5.0
India 46 35.05 8.26 25.5 4.9
Afghanistan 22 37.31 8.20 27.3 4.6
New Zealand 28 26.43 8.02 19.8 5.4
South Africa 24 30.25 7.56 24.0 5.5
Pakistan 32 36.10 7.52 28.8 5.4
West Indies 34 20.73 7.52 16.5 5.5
Zimbabwe 17 23.48 7.14 19.7 5.4

రోహిత్, ధావన్‌లను కాకుండా కె.ఎల్ రాహుల్‌ను కూడా ఓపెనర్‌గా ప్రయత్నించారు. వీరి ముగ్గురు కూడా అమోఘమైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నారు. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మాత్రం టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒకరు.. మరింత డీప్‌‌‌‌గా బ్యాటింగ్ చేస్తే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

శిఖర్ ధావన్ నిలకడలేమి…

2018లో శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆ ఒక్క సంవత్సరంలో 689 పరుగులు చేయగా.. అందులో 6 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఈ ఒక్క సంవత్సరం తప్పితే ధావన్ ఎప్పుడూ కూడా నిలకడగా ఆడింది లేదు. రాహుల్, రోహిత్‌ల మాదిరి పరుగులు సాధించడంలో విఫలమవుతూనే వస్తున్నాడు.

ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ…

టీ20ల్లో అనేక అర్ధ సెంచరీలు, అత్యధిక రన్స్ చేసిన మొదటి ఆటగాడు విరాట్ కోహ్లీ. టీ20 వరల్డ్‌కప్ ముందున్న సమయంలో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా దింపితే ఎలా ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ ఒకసారి భావించాలి. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఓపెనర్‌గా విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కాబట్టి ఒకవేళ ఓపెనర్‌గా విరాట్‌ను ప్రయత్నిస్తే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కాంబినేషన్ ప్రత్యర్ధుల్లో ఒణుకు పుట్టిస్తుందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో చూడాలి ధావన్ స్థానంలో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడో.. లేడో.?