కోహ్లి బీ కేర్‌ఫుల్..నిషేదానికి దగ్గర్లో ఉన్నావ్!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత ఎగ్రెసీవ్‌గా ఉంటాడో మనకి తెలిసిన విషయమే. తన దూకుడుతనంతో చాలా సార్లు క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఓ డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నాడు మన రన్ మెషీన్. సౌతాఫ్రికా బౌలర్ బ్యూరో హెండ్రిక్స్ ఓవర్లో పరుగుకు ప్రయత్నించిన విరాట్ అతడిని నెట్టుకుంటూ వెళ్లాడు. రూల్స్ బ్రేక్ చేసినందుకుగానూ ఐసీసీ .. కోహ్లీకి ఓ […]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత ఎగ్రెసీవ్‌గా ఉంటాడో మనకి తెలిసిన విషయమే. తన దూకుడుతనంతో చాలా సార్లు క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలకు గురైన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించిన కారణంగా ఓ డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నాడు మన రన్ మెషీన్. సౌతాఫ్రికా బౌలర్ బ్యూరో హెండ్రిక్స్ ఓవర్లో పరుగుకు ప్రయత్నించిన విరాట్ అతడిని నెట్టుకుంటూ వెళ్లాడు. రూల్స్ బ్రేక్ చేసినందుకుగానూ ఐసీసీ .. కోహ్లీకి ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించింది.
ఇప్పటికే రెండుసార్లు క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడిన కోహ్లీ తాజాగా మూడో పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇంకొక్క పాయింట్ చేరితే అతడిపై వేటు పడే అవకాశముంది. గతేడాది జనవరిలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఒకటి, వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ మ్యాచ్ సందర్భంలో రెండో డీమెరిట్ పాయింట్ విరాట్ ఖాతాలో చేరాయి. 24 నెలల సమయంలో ఓ ఆటగాడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే అతడిపై ఓ టెస్టు లేదా, 2 వన్డేలు లేదా 2 టీ-20 నిషేధం ఎదుర్కొంటాడు. వీటిలో ఏది ముందు వస్తే ఆ మ్యాచ్‌కి నిషేదం వర్తిస్తుంది.