Telangana: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. రాష్ట్రంలో యథావిధిగా కొనసాగనున్న ప్రైవేట్ కాలేజీలు!
తెలంగాణలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించిన ఈ వారం రూ.600 కోట్లు.. దీపావళిని నాటికి మరో రూ.600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కళాశాలల బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు పేర్కొన్నాయి. దీంతో మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజ్‌లు యథావిధిగా కొనసాగున్నాయి.

తెలంగాణలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించిన రూ.1200 కోట్లు దీపావలిలోపే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కళాశాలల బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు పేర్కొన్నాయి. దీంతో మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజ్‌లు యథావిధిగా కొనసాగున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కాలేజ్‌లను బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు , సీఎస్ రామకృష్ణ రావు, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శలు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ చర్చలపై మరి కొద్దిసేపట్లో మంత్రులు, కళాశాల యాజమాన్యాలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చర్చలకు సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
