AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం.. ఇంకా బండి ఊసే ఉండదు..

తెలంగాణలో మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనం నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కేసులు నమోదు కావడంతో పాటు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. అంతేకాదు, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు మైనర్‌కు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయరు.

పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం.. ఇంకా బండి ఊసే ఉండదు..
Minor Driving Rules
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 08, 2026 | 7:08 PM

Share

మీ అబ్బాయో, అమ్మాయో కాలేజీకో ట్యూషన్‌కో వెళ్తున్నారని.. చేతికి బైక్ లేదా కార్ తాళాలు ఇస్తున్నారా..? మా వాడు.. మా అమ్మాయి చాలా బాగా డ్రైవ్ చేస్తారు అని కాలర్ ఎగరేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. మీరు చేసే ఆ చిన్న పొరపాటు మీ పిల్లను ప్రమాదంలోకి నెట్టడమే కాదు.. మిమ్మల్ని నేరుగా జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తుంది. అవును, తెలంగాణ రవాణా శాఖ ఇప్పుడు మైనర్ డ్రైవింగ్‌పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ హెచ్చరికలు ఏదో మాటలకే పరిమితం కావు. రవాణా శాఖ ఎంత కఠినంగా ఉందో చెప్పడానికి తాజా గణాంకాలే సాక్ష్యం. గత ఆర్థిక సంవత్సరంలో మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు గానూ తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 4,070 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెకింగ్ ఆఫీసర్స్ నిరంతరం నిఘా పెడుతూ, ఎక్కడికక్కడ మైనర్లను పట్టుకుంటున్నారు.

మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 199-ఏ 2019 సవరణ ప్రకారం మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేరం పరిణామం చట్టపరమైన శిక్ష తల్లిదండ్రుల బాధ్యత వాహన యజమాని లేదా సంరక్షకుడే నేరస్తుడిగా పరిగణించబడతారు. చట్టప్రకారం జైలు శిక్ష, భారీ జరిమానా తప్పవు. వాహన రిజిస్ట్రేషన్ రద్దునేరానికి వాడిన సదరు వాహనం రిజిస్ట్రేషన్ 12 నెలల రద్దు చేయబడుతుంది. లైసెన్స్ పై శాశ్వత ప్రభావం పట్టుబడిన మైనర్‌కు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరు.

సాధారణంగా 18 ఏళ్లు నిండగానే లైసెన్స్ వస్తుంది. కానీ మైనర్ డ్రైవింగ్‌లో దొరికితే మాత్రం.. 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ పొందే అర్హతను కోల్పోతారు. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగ రీత్యా లేదా వ్యక్తిగత అవసరాల రీత్యా వాహనం నడపలేక యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

పిల్లల భద్రత, సమాజ భద్రత అందరి బాధ్యత. వాహనం రిజిస్ట్రేషన్ కోల్పోవడంతో పాటు, పిల్లల భవిష్యత్తు దెబ్బతినే ఈ దీర్ఘకాలిక చట్టపరమైన పరిణామాలను తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాల తాళాలు ఇవ్వొద్దు అంటూ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
Video: ఛీ.. వికెట్ కోసం ఇంతకు దిగజారాలా..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..
పక్కా కొలతలతో నోరూరించే ఆంధ్ర స్టైల్ దోస ఆవకాయ..