AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు.

CM Revanth Reddy: భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Anand T
|

Updated on: Aug 07, 2025 | 9:45 PM

Share

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వ‌ర్షాలు ఉంటాయ‌నే స‌మాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అదేశించారు.

జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. భారీగా నీరు చేరే లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. హైదరాబాద్‌ నగరంలో వర్షాలు భారీ కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

మరోవైపు జిల్లాల్లో, గ్రామాల్లో వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు సూచించారు. రైతులు ఎవరూ చెట్ల కింద ఉండవద్దని తెలిపారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్థంభాలు కూలి చెట్లపై పడే అవకాశం ఉందని.. రైతులు చూడకుండా వెళ్తే ప్రమాదాల బారీన పడే అవకాశం ఉందన్నారు. రైతులు పొలాల నుంచి ఇంటికి వచ్చేప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా స్థంభాలు విరిగిపడి ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్