AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Cash: ఏటీఎంలో లోడ్‌ చేసే వాహనంలో రూ.60 లక్షలు.. వ్యాన్‌తో పరారైన డ్రైవర్‌!

ATM Cash: ఏటీఎంలో డబ్బులు జమ చేసేందుకు తీసుకువచ్చిన వాహనంతో డ్రైవర్‌ పరారైన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 8 ఏటీఎంలలో డబ్బులు లోడ్‌ చేసిన తర్వాత చివరగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోపన్‌‌పల్లి యాక్సిస్‌‌ బ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లారు..

ATM Cash: ఏటీఎంలో లోడ్‌ చేసే వాహనంలో రూ.60 లక్షలు.. వ్యాన్‌తో పరారైన డ్రైవర్‌!
Atm Cash Vehicle
Subhash Goud
|

Updated on: Feb 13, 2026 | 11:37 AM

Share

ATM Cash: ఏటీఎంలో డబ్బులు జమ చేసేందుకు తీసుకువచ్చిన వాహనంతో డ్రైవర్‌ పరారైన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు తీసువచ్చిన వాహనంలో రూ. 60 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురువారం హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్‌‌పెక్టర్‌‌ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్‌‌ సంస్థకు యాక్సిస్‌‌ బ్యాంక్‌‌ ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్‌‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సంస్థకు చెందిన వాహనంలో కస్టోడియన్లు ఎస్.రామకృష్ణ, ఎండి. మాలిక్‌‌, సెక్యూరిటీ గార్డు పెరుమాల్‌‌, తిరుమలగిరి ప్రాంతానికి చెందిన డ్రైవర్‌‌ అజిత్‌‌ కుమార్‌‌ కలి 9 ఏటీఎంలలో డబ్బులు జమ చేసేందుకు బయలుదేరారు.

అయితే 8 ఏటీఎంలలో డబ్బులు లోడ్‌ చేసిన తర్వాత చివరగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోపన్‌‌పల్లి యాక్సిస్‌‌ బ్యాంక్‌ ఏటీఎంకు వెళ్లారు. డబ్బులు లోడ్‌ చేసేందుకు కస్టోడియన్లు రామకృష్ణ, మాలిక్‌‌ ఏటీఎంలోకి వెళ్లగా, సెక్యూరిటీ గార్డు పెరుమాల్‌‌ మంచినీళ్ల కోసమని పక్కకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్‌‌ అజిత్‌‌ క్యాష్‌‌తో ఉన్న వాహనంతో పరారయ్యాడు. దీనిని గమనించిన రామకృష్ణ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: PM Kisan: 30 లక్షల మంది రైతులకు నిలిచిపోనున్న పీఎం కిసాన్‌ సాయం.. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి

జీపీఎస్‌ ఆధారంగా వాహనం గుర్తింపు:

ఇదిలా ఉండగా, సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. జీపీఎస్‌‌ ఆధారంగా వాహనం తెల్లాపూర్‌‌లోని గద్దర్‌‌ జంక్షన్‌‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు. అజిత్‌‌ వాహనాన్ని వదిలి అందులో ఉన్న రూ. 60 లక్షలతో పరార్‌‌ అయినట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం 4 ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!