AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మైనర్ బాలికకు దగ్గరయ్యాడు.. ఆపై సీక్రెట్ ఫోటోలు లాగాడు.. సీన్ కట్ చేస్తే.!

మైనర్ బాలికతో ఇన్ స్టాలో పరిచయం పెంచుకున్నాడు.. ఆపై బాగా క్లోజ్ అయ్యి.. వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత ఫోటోలు పొందాడు. ఆ తర్వాత సీన్ కాస్తా మారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: మైనర్ బాలికకు దగ్గరయ్యాడు.. ఆపై సీక్రెట్ ఫోటోలు లాగాడు.. సీన్ కట్ చేస్తే.!
Representative Image
Lakshmi Praneetha Perugu
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 12, 2025 | 12:31 PM

Share

హైదరాబాద్‌లో ఒక విద్యార్థికి నాంపల్లి కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను సోషల్ మీడియా ద్వారా మోసం చేసి, ఆమె వ్యక్తిగత ఫోటోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన విద్యార్థి ఆశం ఆకాష్‌కు నాంపల్లి కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది.

లాలగూడా ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికను ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత నమ్మకం సంపాదించి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని, వ్యక్తిగత ఫోటోలు పొందాడు. కొంతకాలం తర్వాత ఆ ఫోటోలను చూపిస్తూ బాలికను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆకాష్ తన వద్ద ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి, డబ్బు అడిగినట్లు పోలీసులకు సదరు బాలిక తెలిపింది. ఆ బెదిరింపులకు భయపడిన మైనర్ బాలిక కొంతకాలం మౌనంగా భరించింది. తరువాత డబ్బు అవసరమవడంతో సొంత ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బాధితురాలి ప్రవర్తనలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు విచారించగా, ఈ షాకింగ్ విషయమంతా బయటపడింది.

తనపై జరుగుతున్న వేధింపులు ఇక భరించలేనని, ఆకాష్ తన గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని మైనర్ బాలిక లాలగూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆకాష్ మొబైల్‌ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లు సీజ్ చేసి పరిశీలించగా, అనేక వ్యక్తిగత ఫోటోలు, చాట్ రికార్డులు బయటపడ్డాయి. ఈ కేసులో సేకరించిన డిజిటల్ ఆధారాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో కేసు విచారణ జరగగా, పోలీసులు సమర్పించిన ఆధారాలు నిందితుడి దోషి అని నిర్ధారించాయి. చివరికి న్యాయమూర్తి ఆశం ఆకాష్ దోషిగా తేల్చి, అతనికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.