AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగట్లో శ్రీ చైతన్య.. ఆఫరెంతో తెలుసా?

విద్యారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు వేలంలోకి వచ్చాయి. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్‌ఫీల్డ్, కల్పతి ఇన్వెస్ట్‌మెంట్స్ వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. పీఈ ఇన్వెస్టర్ న్యూ సిల్క్ రూట్ పెట్టుబడుల నుంచి తప్పుకోవడంతో దాదాపు $1 బిలియన్ మార్క్ ధరకు కల్పతి ఇన్వెస్ట్మెంట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ గతంలో కె 12 స్కూల్ సెగ్మెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. 2011 వరకు దాదాపు $25 […]

అంగట్లో శ్రీ చైతన్య.. ఆఫరెంతో తెలుసా?
Ravi Kiran
|

Updated on: Oct 22, 2019 | 12:56 PM

Share

విద్యారంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలు వేలంలోకి వచ్చాయి. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ బ్రూక్‌ఫీల్డ్, కల్పతి ఇన్వెస్ట్‌మెంట్స్ వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. పీఈ ఇన్వెస్టర్ న్యూ సిల్క్ రూట్ పెట్టుబడుల నుంచి తప్పుకోవడంతో దాదాపు $1 బిలియన్ మార్క్ ధరకు కల్పతి ఇన్వెస్ట్మెంట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ గతంలో కె 12 స్కూల్ సెగ్మెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది.

2011 వరకు దాదాపు $25 మిలియన్ పెట్టుబడులను ఈ స్కూల్స్‌లో పెట్టిన న్యూ సిల్క్ రూట్ గడువు కొద్దిరోజుల కిందట ముగిసింది. దాదాపు 8 ఏళ్ళ ఇన్వెస్ట్మెంట్ కాలం ముగియడంతో ఆ సంస్థ, ఇన్వెస్టర్లు తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఈ చైతన్య స్కూల్స్ అన్నింటిని కొనుగోలు చేసే ఇన్వెస్టర్ల కోసం యాజమాన్యం చూస్తున్నారు. ఇక వాటి విలువ దాదాపు రూ.8,000 కోట్ల ధర ఉండొచ్చని సమాచారం. మొదటి దిశగా కల్పతి ఇన్వెస్ట్మెంట్స్.. చైతన్య విద్యాసంస్థల ఎండీ సుష్మా బోపన్నకు తమ ధరను కోట్ చేసి పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఆమె ఈ డీల్‌పై తన స్పందన తెలుపలేదని సమాచారం.

ఇదిలా ఉంటే భారతదేశంలో విద్యారంగం అనేది అత్యంత మెలకవతో జరపాల్సిన బిజినెస్.. దీన్ని నిజానికి వ్యాపారం అనడం కన్నా… ఒక సామాజిక ప్రయోజనంగా పరిగణించాలన్నది సంబంధిత వర్గాల వాదన. దీనిలో లాభాలు అధికంగా ఉండటం మాట వాస్తవమే.. అయితే అటు రిస్క్‌లు కూడా అధికంగా ఉంటాయి. దాదాపు 700 స్కూల్స్ అనేది చిన్న విషయం కాదు. కొనుగోలు చేసేది ఎవరైనా ఇందులో యాక్టివ్‌గా ఉండాలి… లేదంటే రిస్క్ దారుణంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు గతేడాది మే నెలలో సూరత్‌లోని ఓ కోచింగ్ సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు మరణించడాన్ని.. ఆ సంస్థ యజమానులు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాక స్కూల్ ఫీజులు అనేవి గవర్నమెంట్ నిర్దేశిస్తుంది. అటు ఆ ఫీజుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి.. రెవిన్యూ వచ్చేలా చూసుకోవాలి.

శ్రీ చైతన్య విద్యాసంస్థలు 1986 సంవత్సరంలో బోపన్న సత్యనారాయణ, ఝాన్సీ లక్ష్మీ బాయిలు విజయవాడలో స్థాపించారు. మొదట బాలికల కాలేజీగా ప్రారంభమైన ఈ సంస్థ క్రమేపి ఎదుగుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ శక్తిగా అవతరించిన సంగతి తెలిసిందే.