Special Trains: హైదరాబాద్ నుంచి మరో స్పెషల్ ట్రైన్.. విజయవాడ మీదుగా.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
వేసవి సెలవుల నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ నుంచి మరో స్పెషల్ ట్రైన్‌ను..
వేసవి సెలవుల నేపధ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ నుంచి మరో స్పెషల్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. విజయవాడ మీదుగా ఈ రైలు నడవనుండగా.. ఆగే స్టేషన్లు, డేట్స్, టైమింగ్స్ ఇలా ఉన్నాయి..
ట్రైన్ నెంబర్ 07165 హైదరాబాద్-కటక్ స్పెషల్ ట్రైన్ జూన్ 6 నుంచి పట్టాలెక్కనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ ఆ రోజు రాత్రి 8.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 5.45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 6, 13, 20, 27 తేదీల్లో అనగా ప్రతీ మంగళవారం హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది.
అటు ట్రైన్ నెంబర్ 07166 కటక్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ జూన్ 7వ తేదీ నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఆ రోజు రాత్రి 10.30 గంటలకు కటక్‌లో బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఆయా రైళ్లకు సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, బెర్హమ్‌పూర్, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్ ప్రధాన స్టేషన్లు కాగా.. పగ్దిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, కృష్ణా కెనాల్ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, సింహాచలం నార్త్, కొత్తవలస, శ్రీకాకుళం రోడ్డు, పలాస ఇతర స్టాపులుగా అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని వెల్లడించారు.
@RailMinIndia @EastCoastRail @DRMWaltairECoR Train Alert !!!
Special Train between Hyderabad-Cuttack-Hyderabad during Summer as per the following… ? pic.twitter.com/vgp4SaxDfG
— DRM KhurdaRoad (@DRMKhurdaRoad) May 30, 2023