Vande Bharat Express: సికింద్రాబాద్ టూ విశాఖ వందేభారత్ షెడ్యూల్ మార్పు.. వివరాలు ఇవిగో..
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సమయంలో..
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సమయంలో కీలక మార్పు జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పు కేవలం ఒక్క రోజు(మంగళవారం) మాత్రమేనని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 20834 ట్రైన్.. ఇవాళ అనగా మార్చి 14వ తేదీన సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుందన్నారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ రోజు గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతోంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవల్సిందిగా రైల్వే అధికారులు పేర్కొన్నారు.
కాగా, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలును సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రధాని నరేంద్రమోదీ ప్రారభించిన సంగతి తెలిసిందే. ఈ రైలు ప్రయాణీకులకు జనవరి 16 నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
SECUNDERABAD-VISAKHPATNAM VANDE BHARAT TRAIN RESCHEDULED TODAY
TR NO. 20834 SECUNDERABAD- VISAKHAPATNAM VANDE BHARAT EXP SCHEDULED TO DEPART SECUNDERABAD @ 15.00HRS ON 14.03.2023 IS RESCHEDULED TO DEPART SECUNDERABAD @ 16.30 HRS ON 14.03.23.DUE TO LATE RUNNING OF PAIRING TRAIN.
— South Central Railway (@SCRailwayIndia) March 14, 2023