Hyderabad: ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని.. మగపిల్లాడి కోసం ఆస్పత్రిలో బాలుడి కిడ్నాప్..
నల్గొండ జిల్లాకు చెందిన ప్రస్తుతం పెద్ద అంబరుపేటలొ ఉంటున్న భార్యా, భర్తలు ఓరుసు వేంకన్న, ఓరుసు కవితను అదుపులొకి తిసుకున్నారు. వెంకన్న,కవితకు ముగ్గురు ఆడపిల్లలే ఉండటము మగపిల్లవాడు లేకపొవడంతో తమకు తెలిసిన దర్శణం నాగ రాజు, కళమ్మతొ ఒక లక్ష రూపాయలతొ అబ్బాయిని ఇస్తామని అడగ్గా..
పాతబస్తీ మెటర్నిటీ ఆస్పత్రికి వచ్చిన 9 నెలల గర్భిణీ 6 ఆరేళ్ల మగ పిల్లవాడు కనిపించకుండా పోయాడు. ఆసుపత్రి బయట ఆడుకుంటు కనిపించకపొవడంతొ బాధితులు హుసేనిఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న తక్షణమే సౌత్ జోన్ డీసీసీ సాయిచైతన్య అదేశాలతొ చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ ఆధ్వర్యంలొ రంగములొకి దిగారు హుసేని ఆలం పొలిసులు. నల్గొండ జిల్లాకు చెందిన ప్రస్తుతం పెద్ద అంబరుపేటలొ ఉంటున్న భార్యా, భర్తలు ఓరుసు వేంకన్న, ఓరుసు కవితను అదుపులొకి తిసుకున్నారు. వెంకన్న,కవితకు ముగ్గురు ఆడపిల్లలే ఉండటము మగపిల్లవాడు లేకపొవడంతో తమకు తెలిసిన దర్శణం నాగ రాజు, కళమ్మతొ ఒక లక్ష రూపాయలతొ అబ్బాయిని ఇస్తామని అడగ్గా 60 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కిడ్నాపునకు గురైన 6 సంవత్సరాల శివకుమార్ ను తల్లిదండ్రులకు అప్పగించారు. వెంకన్న, కవితను అదుపులోకి తీసుకున్నారు. దర్శణం నాగరాజు, కళమ్మ ఇద్దరు పరారీలో ఉన్నారు.
సంతానము లేని వారు చట్టప్రకారము అనాధశ్రమాల ద్వారా, యాప్ ద్వారా సంప్రదించి దత్తత తిసుకొవడానికి ఆస్కాముంది .అంతే కానీ చట్టానికి విరుధ్దముగా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. మీడియా సమావేశంలొ సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య కేసును చేదించిన హుసేనిఆలం పొలిసులను అభినందించారు.