సమతా మూర్తి సేవలో ఆర్ఎస్ఎస్ చీఫ్.. మంగళా శాశనం అందజేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ..

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ హైదరాబాద్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంతో పాటు దివ్యసాకేతాన్ని సందర్శించారు. అక్కడకు చేరుకున్న వెంటనే వేద పండితులు ఆయనకు పుష్పమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని నలుదిక్కుల అందమైన ప్రాకారాన్ని దర్శించుకుంటూ ముందుకు సాగారు. ఈయన వెంట పలువురు బీజేపీ నాయకులు, భద్రతా సిబ్బంది ఉన్నారు.

సమతా మూర్తి సేవలో ఆర్ఎస్ఎస్ చీఫ్.. మంగళా శాశనం అందజేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ..
Rss Chief
Follow us

|

Updated on: Jan 30, 2024 | 8:34 PM

హైదరాబాద్, జనవరి 30: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ హైదరాబాద్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంతో పాటు దివ్యసాకేతాన్ని సందర్శించారు. అక్కడకు చేరుకున్న వెంటనే వేద పండితులు ఆయనకు పుష్పమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని నలుదిక్కుల అందమైన ప్రాకారాన్ని దర్శించుకుంటూ ముందుకు సాగారు. ఈయన వెంట పలువురు బీజేపీ నాయకులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. దివ్యసాకేతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు.

అనంతరం దివ్యసాకేతం ప్రధాన అర్చకులు మోహన్‌భగవత్‌ని వేద పఠనం చేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని కలిసి ధ్యాన మందిరంలో కూర్చొని కాసేపు సేదతీరారు. స్వామీజీతో మాట మంతి నిర్వహించారు. సమతామూర్తి గురించి చిన్నజీయర్ స్వామి దివ్యభాషణాన్ని అందించారు. చివరగా మోహన్ భగవత్ కు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి.. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ దేవతా మూర్తులతో కూడిన మంగళాశాసనం అందజేశారు. దీనిని మహాప్రసాదంగా స్వీకరించిన తరువాత ఆర్ఎస్ఎస్ చీఫ్‎ చిన్నజీయర్ స్వామి, ఉత్తరాధికారితో కలిసి మధుర జ్ఙాపకాలకు ప్రతీకగా ఫోటో దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..