TS Genco and Transco Notification 2024: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా సంస్థ (టీఎస్‌ ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్‌ జెన్‌కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాన్స్‌కోలో 3.. ట్రాన్స్‌కో డైరెక్టర్‌ (గ్రిడ్, ట్రాన్స్‌మిషన్‌), డైరెక్టర్‌(ఫైనాన్స్‌), డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) పోస్టులతోపాటు , జెన్‌కోలో 5.. డైరెక్టర్‌ (జలవిద్యుత్‌), డైరెక్టర్‌ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ ఐఆర్‌), డైరెక్టర్‌ (కోల్‌–లాజిస్టిక్స్‌)..

TS Genco and Transco Notification 2024: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
Telangana Transco
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 30, 2024 | 2:00 PM

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా సంస్థ (టీఎస్‌ ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్‌ జెన్‌కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాన్స్‌కోలో 3.. ట్రాన్స్‌కో డైరెక్టర్‌ (గ్రిడ్, ట్రాన్స్‌మిషన్‌), డైరెక్టర్‌(ఫైనాన్స్‌), డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) పోస్టులతోపాటు , జెన్‌కోలో 5.. డైరెక్టర్‌ (జలవిద్యుత్‌), డైరెక్టర్‌ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ ఐఆర్‌), డైరెక్టర్‌ (కోల్‌–లాజిస్టిక్స్‌), డైరెక్టర్‌ (ఫైనాన్స్‌–కమర్షియల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రాన్స్‌కోలో ఇప్పటి వరకూ నలుగురు డైరెక్టర్లు ఉన్నారు. అయితే వారిని నిబంధనల మేరకు నియమించలేదని తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించింది. అయితే ఈ సారి మూడు డైరెక్టర్‌ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌కో తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 62 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని తేదీని తుది గడువుగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్‌ల డైరెక్టర్‌ పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఇన్‌ సర్వీస్, రిటైర్డ్‌ విద్యుత్‌ అధికారులను ఈ పోస్టులకు ప్రభుత్వం ఎంపిక చేయనుంది. వీరికి ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకుండా.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఒక్కో డైరెక్టర్‌ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్‌ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు.

సెలక్షన్‌ కమిటీలో ఆయా విద్యుత్‌ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్‌ చేసే విద్యుత్‌రంగ ఇండిపెండెంట్‌ ఎక్స్‌పర్ట్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిఫారసు చేసిన షార్ట్‌ లిస్టులోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇలా ఈ 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్టర్‌ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. ట్రాన్స్‌కో, జెన్‌కోలకు ఎంపికైన డైరెక్టర్లు ఆ పదవుల్లో కేవలం రెండు యేళ్లు మాత్రమే కొనసాగుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..