Telangana: ఛీ..ఛీ.! మీరు అస్సలు మనుషులేనా.. ఇది చూస్తే జంతువులే బెటర్ అంటారు
ఛీ.. ఛీ.. అసలు వీళ్లు మనుషులేనా.. రానురానూ మనుషుల్లో మానవత్వం మంట గలిసిపోతోంది. తాజాగా ఇందుకు నిదర్శనంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. అది చూస్తే మీరు కూడా మీకంటే జంతువులే బెటర్ అని అంటారు. ఆ స్టోరీ ఏంటంటే
కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే మనుషుల కంటే జంతువులే చాలా బెటర్ అని అనిపిస్తుంది. రానురానూ మనుషుల్లో మానవత్వం పూర్తిగా మంటగలిసిపోతుంది. కొందరు అయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు. అందరూ అసహ్యించుకునే విధంగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌పై వదిలివెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. అభం శుభం తెలియని ఆ పసికందు అరుపులు విని పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు. రోజులు కూడా నిండని పసికందును ఇలా నడిరోడ్డుపై వదిలి వెళ్లిన దుర్మార్గులకు కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు స్థానికులు. మరోవైపు నవ మాసాలు మోసి జన్మనిచ్చిన ఆ పసికందు తల్లి కూడా దీనికి ఎలా ఒప్పుకుందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనుషుల కంటే, జంతువులే బెటర్ అని అనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి