AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంజారాహిల్స్ భూవివాదం.. ఎమ్మార్వో సుజాత అరెస్ట్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో ఊహించిందే జరిగింది. ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అరెస్టు చేసింది. బంజారాహిల్స్ భూవివాదంలో లంచం ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు.

Ram Naramaneni
|

Updated on: Jun 08, 2020 | 10:23 PM

Share

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో ఊహించిందే జరిగింది. ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అరెస్టు చేసింది. బంజారాహిల్స్ భూవివాదంలో లంచం ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఖాలీద్ అనే వ్యక్తి నుంచి ఆమె లంచం తీసుకున్నట్లు ఆధారాలు దొర‌క‌డంతో సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేసి.. మెడిక‌ల్ టెస్టుల‌ కోసం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను న్యాయ‌మూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు.

బంజారాహిల్స్‌‌లో రూ.50 కోట్ల విలువైన ల్యాండ్ వ్యవహారం క‌ల‌క‌లం రేపింది. భూ వివాదాన్ని సాల్వ్ చేస్తానంటూ ఖాలీద్‌ అనే వ్యక్తి నుంచి ఆర్‌ఐ నాగార్జునరెడ్డి రూ.30 లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో గుట్టు ర‌ట్టైంది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్‌ఐ అడ్డంగా బుక్క‌య్యాడు. ఇదే వ్య‌వ‌హారంలో కేసు మాఫీ చేస్తానంటూ రూ.3 లక్షలు డిమాండ్‌ చేసి ఎస్‌ఐ రవీంద్రనాయక్‌ కూడా అరెస్ట్‌ అయ్యారు. ఇంత‌ భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేయడం వెనుక ఉన్నతాధికారుల హ‌స్తం ఉందా? అనే అంశంపై ఏసీబీ అధికారులు ఫోక‌స్ పెట్టారు. ఈ క్రమంలో షేక్‌పేట్ ఎమ్మార్వో‌ సుజాతను వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆమె ఇంట్లో తనిఖీ చేయగా.. రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దొరికాయి. అవి ఎక్కడ‌నుంచి వ‌చ్చ‌య‌నే విష‌యంపై ఎమ్మార్వో సరైన ఆధారాలు చూపకపోవడంతో..ఈ కేసు వ్య‌వ‌హారంలో ఆమె పాత్ర‌ను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
దసరా వేళ సొంతూళ్లకు పయనమైన పట్నం.. రోడ్డపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
సిరీస్ గెలవాలంటే ఆ వజ్రాయుధాన్ని దింపాల్సిందే..!
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని విమానానికి బాంబ్ బెదిరింపు
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
పండుగ వేళ గోల్డ్ కొనేవారికి ఊరట.. ధరలు ఒక్కసారిగా ఢమాల్..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత