Hyderabad: ఇద్దరు పిల్లల తల్లిపై మనసుపడ్డాడు.. ఆ తర్వాత క్రూర మృగంలా మారి..

సూరారం బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతంగా మారింది.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి..

Hyderabad: ఇద్దరు పిల్లల తల్లిపై మనసుపడ్డాడు.. ఆ తర్వాత క్రూర మృగంలా మారి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 15, 2024 | 6:57 PM

హైదరాబాద్‌ సూరారం బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానితుడిగా తిరుపతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కీలక విషయాలు బయటకొచ్చాయి. మొత్తం కుటుంబాన్ని చంపేందుకు నిందితుడి కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిపై మనసుపడ్డ నిందితుడు తిరుపతి.. ఇద్దరు పిల్లలు, ఆమె భర్తను చంపేందుకు ప్లాన్‌ చేసినట్లు ఒప్పుకున్నాడు. దానిలో భాగంగానే.. పిల్లల్ని చంపేసి ముళ్ల పొదల్లో పడేయాలని నిర్ణయించుకుని ఒక బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు.. మరో చిన్నారి హత్యకు సిద్ధమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం కలకలం రేపుతోంది. ఇక.. పాపను హత్య చేసి మేడ్చల్‌ అటవీ ప్రాంతంలో వేసినట్లు చెప్పడంతో ఆయా ప్రాంతాల్లో గాలించారు పోలీసులు. దాంతో.. అటవీ ప్రాంతంలో మూట కట్టి పడేసిన ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు. పాప డెడ్‌బాడీగా గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. కాగా.. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.

అదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభాకర్ కుటుంబంతో సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న (7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు బాలిక కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. అనుమానంతో తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. 12 ఏళ్ల కుమార్తె హత్యపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!