AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. న్యాచురల్ దివ్యౌషధం.. షుగర్‌తో సహా ఆ సమస్యలన్నింటికీ బ్రహ్మాస్త్రం..

అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి. ఇది ఏ ఆయుర్వేద ఔషధం కంటే తక్కువ కాదు. మనం దానిని పచ్చిగా నమలి తినొచ్చు.. దాని రసాన్ని తాగొచ్చు.. లేదా హెర్బల్ టీతో సేవించవచ్చు.. అల్లాన్ని ఎలా తీసుకున్నా.. అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. న్యాచురల్ దివ్యౌషధం.. షుగర్‌తో సహా ఆ సమస్యలన్నింటికీ  బ్రహ్మాస్త్రం..
Benefits Of Ginger
Shaik Madar Saheb
|

Updated on: Oct 13, 2024 | 2:52 PM

Share

అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి. ఇది ఏ ఆయుర్వేద ఔషధం కంటే తక్కువ కాదు. మనం దానిని పచ్చిగా నమలి తినొచ్చు.. దాని రసాన్ని తాగొచ్చు.. లేదా హెర్బల్ టీతో సేవించవచ్చు.. అల్లాన్ని ఎలా తీసుకున్నా.. అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాస్తవానికి అల్లం మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం.. దాని సహాయంతో మనం అనేక రకాల వంటకాల రుచిని పెంచవచ్చు.. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.. రిపేర్ చేసుకోవచ్చు..

మనం అల్లాన్ని పచ్చిగా నమలడం, దాని రసాన్ని త్రాగడం లేదా హెర్బల్ టీ, మామూలు టీలో అల్లం వేసుకుని రెగ్యులర్ గా తీసుకోవచ్చు.. ఇది మన ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా, ఇందులో విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, ఫోలేట్, రిబోఫ్లేవిన్, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. అల్లం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకోండి..

అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: అల్లంలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.. దీని కారణంగా మీ కడుపు సరిగ్గా పని చేస్తుంది.. తద్వారా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది.
  2. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది: అల్లం విటమిన్ సి కి మంచి మూలం.. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.
  3. రక్తపోటును నియంత్రిస్తుంది: అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సహజ మూత్రవిసర్జనలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
  4. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి.. చర్మ సౌందర్యం పెరుగుతుంది.
  5. బరువు తగ్గుతుంది: అల్లం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కాల్చేస్తాయి.
  6. జలుబు – దగ్గును నివారిస్తుంది: అల్లం వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది.
  7. మధుమేహం నివారణ: అల్లం తీసుకోవడం మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
  8. ఆర్థరైటిస్ రోగులకు మేలు చేస్తుంది: అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగిస్తాయి.
  9. ఒత్తిడిని తగ్గిస్తుంది: అల్లం తీసుకోవడం ఒత్తిడిని తగ్గించడంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  10. అల్జీమర్స్ నుంచి రక్షణ: అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అల్జీమర్స్ వంటి మానసిక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..