Nara Rohith – Siri Lella: హీరోయిన్ సిరితో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?

ఇటీవల నటించిన ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాను నారా రోహిత్ వివాహమాడబోతున్నారు. వారి నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరుగుతోంది..

Nara Rohith - Siri Lella: హీరోయిన్ సిరితో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?
Nara Rohit Engagement
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2024 | 1:11 PM

టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ ఓ ఇంటివాడవుతున్నాడు. ఆయన ఇటీవల నటించిన ‘ప్రతినిధి 2’ హీరోయిన్ సిరిలెల్లాను నారా రోహిత్ వివాహమాడబోతున్నారు. వారి నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరుగుతోంది.. నోవాటెల్‌లో ఉదయం 10.45కి రోహిత్‌-శిరీష నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇరువురి కుటుంబ పెద్దలు డిసెంబర్‌ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు. సిరిలెల్లా- నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్ వేడుకకు నారా, నందమూరి కుటుంబాలు హాజరయ్యాయి.. దీంతోపాటు అమ్మాయి తరపు ముఖ్యమైన బంధువులు, పలువురు సినీ తారల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Nara Rohith

కాగా.. ప్రతినిధి-2 సినిమాలో నారా రోహిత్‌తో కలిసి నటించింది శిరీష. ఇప్పుడు వీళ్లిద్దరూ రియల్‌ లైఫ్‌లోనూ పార్ట్‌నర్స్ అవుతున్నారు.. బాణంలా సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి ప్రతి మూవీ సెలక్షన్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రోహిత్‌.. పెళ్లి విషయంలోనూ బాగా టైమ్ తీసుకున్నారు. ఫైనల్‌గా సోలో లైఫ్‌కి గుడ్‌బై చెప్పి తన మనసుకు నచ్చిన ప్రతినిధిగా శిరీష చెయ్యి పట్టుకుని ఏడడుగులు వెయ్యబోతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి