సీనియర్ జర్నలిస్ట్ సి.నరసింహరావు కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస

సీనియర్ జర్నలిస్ట్ సి.నరసింహరావు కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస
C.narasimharao

రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్ట్ సి.నరసింహారావు(C.Narasimha Rao) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి 1.50 గంటలకు కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా....

Ganesh Mudavath

|

May 12, 2022 | 12:13 PM

రాజకీయ, సామాజిక విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్ట్ సి.నరసింహారావు(C.Narasimha Rao) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి 1.50 గంటలకు కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రులో నరసింహారావు జన్మించారు. హైస్కూల్ వయసులోనే ప్రఖ్యాత రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి పుస్తకాలకు ఆయన ఎక్కువగా ఆకర్షితులయ్యారు. అంతే కాకుండా గ్రామంలో కమ్యూనిస్టు భావజాలం ఉండటంతో ఆ ప్రభావం నరసింహారావుపై పడింది. నిరంతర శోధన, ప్రశ్నించే తత్వంపై ఆయనకు ఆసక్తి ఏర్పడింది. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోపాటు యువతలో చైతన్యం, స్ఫూర్తి నింపేలా పుస్తకాలు రాశారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు. ప్రపంచ ప్రఖ్యాత రచయితలు రాసిన పుస్తకాలనూ చదివారు. ‘రేపు’ అనే దేశంలోనే తొలి మనో విజ్ఞానపత్రికకు ఆయనే వ్యవస్థాపకుడు కావడం విశేషం.

నరసింహారావు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరసింహారావు మరణం విచారకరమని, వ్యక్తిత్వ వికాసంపై ఆయన రాసిన పుస్తకాలు యువతలో స్ఫూర్తి నింపాయని చంద్రబాబు అన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్లు నరసింహారావు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

AP Inter Exams 2022: యథావిధిగా ఏపీ ఇంటర్ పరీక్షలు.. ఆ వదంతుల్ని నమ్మొద్దు! మే 13 నుంచి మూల్యంకనం..

ఇవి కూడా చదవండి

TS ePass Scholarship 2022: తెలంగాణ విద్యార్ధులకు అలర్ట్‌! స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు మరో అవకాశం..చివరి తేదీ ఇదే!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu