AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఘోరం.. యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అఘాయిత్యం.. ఆ తర్వాత

బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి.. అదే ప్రాంతంలోని ఓ మాల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చిన్మయి సైక్యా (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఘోరం.. యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అఘాయిత్యం.. ఆ తర్వాత
child harassment
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2022 | 8:10 AM

Share

Hyderabad Crime News: నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘటన మరువకముందే.. బంజారాహిల్స్‌లో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి సెక్యూరిటీగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఈ నెల 4న జరిగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజరాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి.. అదే ప్రాంతంలోని ఓ మాల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చిన్మయి సైక్యా (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువకుడు యువతిపై కన్నేశాడు. ఈ నెల 4న బాధితురాలి ఇంటికి ఏదో పని ఉందంటూ వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన అతను.. యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని యువతిని బెదిరించాడు.

ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని.. ఆ యువతి మరుసటి రోజు ఉదయం తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెస్సెజ్ పంపింది. వెంటనే ఆమె బాధితురాలి సోదరికి ఈ విషయాన్ని చెప్పింది. వెంటనే ఆమె.. బాధితురాలిని ప్రశ్నించగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్